
వాహనాల పార్కింగ్‌కు..
బీబీనగర్ మండలం గూడూరు టోల్‌గేట్ ప్లాజా వద్ద జాతీయ రహదారి పక్కన రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. అనుమతి లేకుండా సర్వీస్ రోడ్డు నుంచి దారి ఏర్పాటు చేసుకోగా ఇటీవల హైవే అధికారులు జేసీబీతో తవ్వారు. దీంతో పార్కింగ్ స్థలం లేక కస్టమర్లు రావడం లేదు. ఆర్థికంగా నష్టపోతున్నానని హోటల్ యజమాని ఎన్‌హెచ్‌ఏఐ పీడీ దుర్గాప్రసాద్‌ను వేడుకోగా రూ.లక్ష ఇవ్వాలని పీడీ డిమాండ్ చేశాడు. దీంతో సదరు రెస్టారెంట్ ఓనర్ సీబీఐ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు తొలుత రెస్టారెంట్ ఓనర్ రూ.60 వేలు ఇస్తుండగా సీబీఐ అధికారులు పీడీని పట్టుకున్నారు.