ముందుగానే మద్యం టెండర్లు | - | Sakshi
Sakshi News home page

ముందుగానే మద్యం టెండర్లు

Aug 21 2025 8:51 AM | Updated on Aug 21 2025 8:51 AM

ముందుగానే మద్యం టెండర్లు

ముందుగానే మద్యం టెండర్లు

రెండేళ్ల కాల పరిమితితో నూతన మద్యం పాలసీ ఖరారు

సాక్షి, యాదాద్రి: స్థానిక సంస్థలకు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నూతన మద్యం దుకా ణాలకు ముందుగానే టెండర్లు ఆహ్వానించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించి బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. జిల్లాలో భువనగిరి, చౌటుప్పల్‌, ఆలేరు, యాదగిరిగుట్ట ఎకై ్సజ్‌ సరిళ్ల ఉండగా, వాటి పరిధిలో 82 మద్యం షాపులు ఉన్నాయి. మద్యం వ్యాపారులు, ఆశావహులు దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధం అవుతున్నారు.

నవంబర్‌తో ముగియనున్న

ప్రస్తుత లైసెన్స్‌ కాలం

మద్యం దుకాణాల ప్రస్తుత లైసెన్స్‌ గడువు నవంబర్‌ 30తో ముగియనుంది. స్థానిక సంస్థలకు సెప్టెంబర్‌ 30వ తేదీలోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ఎన్నికల సంఘం కూడా ఏర్పాట్లు పూర్తి చేసి ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉంది. ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తే ఆ సమయంలో మద్యం షాపుల టెండర్లకు వీలుండదనే ఆలోచనతో ముందుగానే నోటిపికేషన్‌ జారీ చేసినట్లు తెలుస్తోంది. కాగా గతంలో ఉన్న మద్యం పాలసీ విధానాన్ని ఈసారి కూడా అమలుపరచనుంది. 2025 డిసెంబర్‌ 1 నుంచి 2027 నవంబర్‌ 20 వరకు రెండేళ్ల కాలానికి దుకాణాలను కేటాయిస్తారు.నాన్‌ రిఫండబుల్‌ ఫీజు గతంలో రూ.2లక్షలు ఉండగా ఈసారి రూ.3 లక్షలుగా నిర్ణయించారు. ఒక్కరు ఎన్ని దరఖాస్తులైనా వేయొచ్చు.

రిజర్వేషన్‌ ప్రకారం..

రిజర్వేషన్ల ప్రకారం మద్యం దుకాణాలను కేటా యించనున్నారు. ఎస్సీలకుు 10 శాతం, ఎస్‌టీలకు 5 శాతం, గౌడ కులస్తులకు 15 శాతం రిజర్వేష కల్పిస్తారు. రిజర్వేషన్ల వెసులుబాటుతో ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

సిద్ధమవుతున్న ఆశావహులు

మద్యం వ్యాపారులు, ఆశావహులు టెండర్లు వేసేందుకు సిద్ధం అవుతున్నారు. నాన్‌ రిఫండబుల్‌ ఫీజు రూ.3 లక్షలు నిర్ణయించినందున నలుగురైదుగురు కలిసి ఒకరిపై దరఖాస్తు చేసేందుకు ఏర్పాట్లు చేసు కుంటున్నారు. పబ్లిక్‌ డిమాండ్‌ ఉన్న చోట పోటీ ఎక్కువనే ఉండనుంది. క్రితంసారి 3,969 దరఖా స్తులు రాగా.. ప్రభుత్వానికి రూ.79.38 కోట్ల ఆదా యం సమకూరింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈసారి కూడా పోటీ తీవ్రంగా ఉండనుందని ఎక్జైజ్‌ శాఖ భావిస్తుంది.

నోటిఫికేషన్‌ జారీ చేసిన ప్రభుత్వం

సెప్టెంబర్‌ రెండో వారంలోపు షెడ్యూల్‌, అదే రోజునుంచి దరఖాస్తుల స్వీకరణ

దరఖాస్తు ఫీజు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంపు

అక్టోబర్‌లో లక్కీ డ్రా

డిసెంబరు నుంచి కొత్త వైన్స్‌ల

నిర్వహణకు అవకాశం

జిల్లాలో 82 మద్యం దుకాణాలు

లాటరీ పద్ధతిలో కేటాయింపు

నూతన మద్యం టెండర్లకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. సెప్టెంబరు 2వ వారంలోపు షెడ్యూల్‌ విడుదల చేసి ఆనెల మొత్తం దరఖాస్తులు స్వీకరించి, పరిశీలించే అవకాశం ఉంది. అక్టోబర్‌లో డ్రా పద్ధతిలో షాపుల కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. దుకాణాల వారీగా వచ్చిన దరఖాస్తులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డబ్బాల్లో వేసి దరఖాస్తుదారుల సమక్షంలో కలెక్టర్‌ డ్రా తీయనున్నారు.

ఆరు స్లాబ్‌లలో ఫీజు..

జిల్లాలో 82 మద్యం దుకాణాలున్నాయి. జనాభా ప్రాతిపదికన షాపులకు పీజు ఉంటుంది. రెండేళ్ల కాలానికి నాలుగు నెలలకోసారి ఆరు స్లాబ్‌లలో లైసెన్స్‌దారులు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

5 వేల జనాభా లోపు రూ.50 లక్షలు

5 వేల నుంచి 50వేల జనాభాకు రూ.55 లక్షలు

50వేల నుంచి లక్ష జనాభాకు రూ.60లక్షలు

లక్ష నుంచి 5 లక్షల వరకు రూ.65లక్షలు

5లక్షల నుంచి 20లక్షల జనాభాకు

రూ.85 లక్షలు

20లక్షల పైచిలుకు జనాభా ఉంటే రూ. కోటి

10లక్షలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement