
వాగులకు వరద
ఉధృతంగా ప్రవహిస్తున్న బిక్కేరు, మూసీ
గురువారం శ్రీ 14 శ్రీ ఆగస్టు శ్రీ 2025
ఆలేరు,మోత్కూరు,యాదగిరిగుట్ట, అడ్డగూడూరు:
భారీ వర్షానికి జిల్లాలో మూసీతో పాటు పలు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మూసీ లోలెవల్ వంతెనలు, బిక్కేరు వాగు, నక్కల వాగు వద్ద రాకపోకలు నిలిపివేశారు. రాచకొండ సీపీ సుధీర్‌బాబు ఇతర అధికారులు బుధవారం రుద్రవెల్లి– జూలూరు, సంగెం వద్ద మూసీలో వరదను పరిశీలించారు. జిల్లాలో 1,152 చెరువులు ఉండగా మూసీ పరీ వాహకంలోని 80 చెరువులు నిండి అలుగుపోస్తున్నాయి. గుండాల మండలంలో రెండు ఇళ్లు కూలి పోయాయి. రానున్న మూడు రోజులు భారీ వర్ష సూచన నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఎటవంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు రెస్క్యూ బృందాలను సిద్ధం చేశారు.
ఆలేరులో..
పట్టణంలో 26.8 మి. మీ వర్షపాతం నమోదైంది. ఆలేరు పెద్దవాగు ,రత్నాల వాగులో వరదనీరు పారుతోంది. బైరవకుంట, ఎంకుంటలో నీరు చేరుతోంది. పాత మున్సిపల్ కార్యాలయం సమీపంలో, బ్రహ్మంగారి గుడి వద్ద, వడ్లబురాన్ ఇంటి వద్ద వరద కాల్వల్లో పూడికతీయకపోవడం వల్ల వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో స్థానికులు ఇబ్బందులకు గురయ్యారు. బుధవారం ఉదయం ప్రగతి స్కూల్, పాత మున్సిప ల్ కార్యాలయం, కొలనుపాకకు వెళ్లే దారిలోని వంతెన వద్ద వరద నీటిని తహసీల్దార్ పరిశీలించారు. వరదనీరు సాఫీగా వెళ్లేందుకు చర్యలు తీసుకున్నారు. భారీ వర్షాలు కురిస్తే ముంపు పొంచి ఉన్న రంగనాయకుల వీధి, పాత మున్సిపల్ కార్యాలయం, సిల్క్‌నగర్ తదితర లోతట్టు ప్రాంతాలపై అధికారులు దృష్టిసారించారు.
ఎస్‌డీఆర్‌ఎస్, అగ్నిమాపక సిబ్బంది రెడీ..
వరుసగా మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో అగ్నిమాపక, ఎస్‌డీఆర్‌ఎస్ సిబ్బంది సిద్ధమైంది. అత్యవసర పరిస్థితులకు ఎదుర్కొనేందుకు 20 మంది ఎస్‌డీఆర్‌ఎస్, 14మంది అగ్నిమాపక సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. రెస్క్యూ బోట్లు, లైఫ్‌బాయ్స్, రోప్స్, లైఫ్ జాకెట్స్, విక్టిమ్ లొకేటింగ్ కెమెరా, కట్టర్స్ తదితర సామగ్రిని అందుబాటులో ఉంచారు.
పెరుగుతున్న భూగర్భ జలాలు
మోత్కూరు మండలం పొడిచేడు, నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం అమ్మనబోలు మధ్య మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో నదికి ఇరు వైపులా గ్రామాల పరిధిలో భూగర్భ జలాలు పెరుగుతు న్నాయి. బోర్లు కూడా రీచార్జ్ అవుతుండటంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
వాగుల వద్ద కాపాలా..
అడ్డగూడూరు మండలంలో బుధవారం రాత్రి కురిసిన వర్షానికి వాగుల్లో వరద ప్రవాహం పెరిగింది. అడ్డగూడూరు– గోవిదాపురం మధ్య నక్కల వాగు, వెల్వేవి–చౌల్లగూడెం, అజీంపేట గ్రామాల వద్ద లో లెవల్ బ్రిడ్జిల పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. తహసీల్దార్ శేషగిరిరావు, ఎంపీడీఓ శంకరయ్య, పొలీసులు ఆయా ప్రాంతాలను పర్యవేక్షించారు. వాగులనుంచి వెళ్లవద్దని ప్రజలకు సూచించారు.
13ఎన్‌ఎల్‌సీ18,19 :
న్యూస్‌రీల్
ఫ లో లెవల్ వంతెనల వద్ద రాకపోకలు బంద్
ఫ మూసీ పరీవాహకంలో
అలుగుపోస్తున్న 80 చెరువులు
ఫ మిగతా చెరువులు, కుంటలకూ జలకళ
ఫ రుద్రవెల్లి– జూలూరు, సంగెం వద్ద మూసీని పరిశీలించిన సీపీ సుధీర్‌బాబు

వాగులకు వరద

వాగులకు వరద

వాగులకు వరద

వాగులకు వరద

వాగులకు వరద