
రైతు సంక్షేమంపై రాజీపడం
ఫ ప్రభుత్వ విప్ ఐలయ్య, డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి
రాజాపేట: రైతు సక్షేమంపై రాజీపడబోమ ని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీని వాస్‌రెడ్డి అన్నారు. రాజాపేట మండలం రేణికుంట ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం కార్యాలయం, గోదాంలను బుధవారం వారు ప్రారంభించారు. పీఏసీఎస్ చైర్మన్ చింతలపురి భాస్కర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి ప్రాధాన్యమిస్తుందని, అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే రూ.లక్ష ఓట్లు ఖర్చు చేసిందన్నారు. పీఏసీఎస్ కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యానికి మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమ చేసిందన్నారు. ఎరువులకు ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని, అవసరం మేరకు ఎరువులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీసీఈఓ శోభారాణి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఐనాల చైతన్య మహేందర్‌రెడ్డి, డైరెక్టర్లు సిలివేరు బాలరాజు గౌడ్, విఠల్ నాయక్, తహసిల్దార్ అనిత, ఎంపీడీఓ నాగవేణి, పీఏసీఎస్ డైరెక్టర్లు, సీఈఓ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

రైతు సంక్షేమంపై రాజీపడం