
మోసం చేసిన సీఎం
రాష్ట్రంలో 50లక్షల మంది పింఛన్‌దారులను సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేశాడని మందకృష్ణ మాదిగ విమర్శించారు.
- 8లో
అప్రమత్తంగా ఉండాలి
భూదాన్‌పోచంపల్లి, వలిగొండ: రెడ్ అలెర్ట్ జోన్‌లో ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాలోని లో తట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని రాచకొండ సీపీ సుధీర్‌బాబు అధికారులను ఆదేశించారు. బుధవారం భూదాన్‌పోచంపల్లి మండలంలోని జూలూరు, వలిగొండ మండలంలోని సంగెం వద్ద మూసీలో వరద ఉధృతిని పరిశీలించారు. అధికారులకు సూచనలు చేశారు. పశువులు, గొర్రెల కాపరులు వాగులు, మూసీని దాటే ప్రయత్నంలో ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉన్నందున, రాకపోకలు సాగించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే శిథిల భవనాల్లో నివసించే వారిని గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.కాగా సంగెం వద్ద లో లెవల్ వంతెనపై పేరుకుపోయిన గుర్రపుడెక్కను అధికారులు జేసీబీతో తొలగించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ సీపీ లక్ష్మీనారాయణ, ఏసీపీ మధుసూధన్‌రెడ్డి, ఎంపీడీఓ జలందర్‌రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ ప్రభాకర్‌రెడ్డి, చౌటుప్పల్ రూరల్ సీఐ రాములు, ట్రాఫిక్ సీఐ జయమోహన్, తహసీల్దార్ పి.శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి, ఆర్‌ఐ గుత్తా వెంకట్‌రెడ్డి, పోలీసు అధికారులు ఉన్నారు.