
చద్దన్నం.. చక్కటి ఆరోగ్యం
భువనగిరి: ప్రస్తుతం చద్దన్నం తినడం ట్రెండ్‌గా మారింది. ఉదయం ఇడ్లి, దోశ, వడ, పూరి, బోండాలకు బదులుగా చద్దన్నం తినడం అలవాటుగా మార్చుకుంటున్నారు. పట్టణాల్లో చద్దన్నం విక్రయ కేంద్రాలు వెలుస్తున్నాయి. ఈ క్రమంలో నల్లగొండ జిల్లా చందుపట్లకు చెందిన దోసపాటి నాగరాజు భువనగిరిలో చద్దన్నం కేంద్రం ఏర్పాటు చేశాడు.
ఇలా తయారు చేస్తారు
ముందు రోజు సాయంత్రం అన్నం వండుతారు. అనంతరం మట్టిపాత్రలో వేసి పాలుపోసి తోడు వేస్తారు. ఉల్లి, పచ్చి మిర్చి, జీలకర వేస్తారు.మరుసటి రోజు ఉదయం మట్టిపాత్రలో ఉన్నది చద్దన్నంగా మారుతుంది. సాధారణ బియ్యం, అరికెలు, జొన్నలతో తయారు చేస్తారు. ప్లేట్ రూ.30 నుంచి రూ.40 వరకు విక్రయిస్తున్నారు.
జొన్నల చద్దన్నం
ప్రయోజనాలు..
చద్దన్నంలో ప్రోబయోటిక్స్ బాక్టీరియా వృద్ధి చెందడంతో జీర్ణక్రియకు దోహదపడుతుంది.
ఎర్రరక్త కణాలు ఉత్పత్తికి తోడ్పడే బీ12 విటమిన్ ఉత్పత్తి అవుతుంది.
ఎముకలు దృడంగా ఉండటానికి, ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
ఆదరణ పెరుగుతోంది
పాతకాలంలో చద్దన్నం ఎక్కువగా తినేవారు. అందుకే వారు ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించేవారు. తిరిగి అలాంటి ఆహారం తీసుకోవడానికి ప్రస్తుతం జనం ఇష్టపడుతున్నారు. ఈ ఆలోచనతోనే భువనగిరిలోని ప్రిన్స్ చౌరస్తాలో ‘మన చద్దన్నం’ పేరుతో విక్రయకేంద్రం ఏర్పాటు చేశాను. నాతో పాటు మరో ఇద్దరికి ఉపాధి కల్పిస్తున్న. రోజురోజుకూ ఆదరణ పెరుగుతుంది.
– దోసపాటి నాగరాజుగౌడ్, చద్దన్నం
కేంద్రం నిర్వాహకుడు, భువనగిరి
ఫ బ్రేక్‌ఫాస్ట్‌లో చద్దన్నానికి ప్రాధాన్యం
ఫ రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణ
ఫ పట్టణాల్లో విక్రయ కేంద్రాలు,
యువతకు ఉపాధిమార్గం

చద్దన్నం.. చక్కటి ఆరోగ్యం

చద్దన్నం.. చక్కటి ఆరోగ్యం

చద్దన్నం.. చక్కటి ఆరోగ్యం