స్థానికంగా విధులు కేటాయించాలి | - | Sakshi
Sakshi News home page

స్థానికంగా విధులు కేటాయించాలి

Nov 12 2026 5:18 AM | Updated on Nov 12 2026 5:18 AM

స్థానికంగా విధులు కేటాయించాలి కౌలు రైతులను ఆదుకోవాలి మురుగునీరు తొలగింపు 1.98 లక్షల ఎకరాల్లో వరికి నష్టం

భీమవరం: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉ పాధ్యాయులకు ఎన్నికల విధులను వారి పనిచేస్తున్న మండలాలు లేదా సమీప మండలాల్లోనే కేటాయించాలని ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ జిల్లా శాఖ అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు జి.ప్రకాశం, బీవీ నారాయణ బుధవా రం డీపీఓకు వినతిపత్రం అందజేశారు. పరిషత్‌ ఎన్నికల్లో టీచర్లకు సుదూర ప్రాంతాల్లో విధులు కేటాయించడంతో ఇబ్బందులు పడ్డారన్నారు. అలాగే అనారోగ్య బాధితులు, బాలింతలు, గ ర్భిణులు, దివ్యాంగులకు ఎన్నికల విధుల ను ంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. జిల్లా ఉపాధ్యక్షుడు లంక రాజు, భీమవరం మండల ప్రధాన కార్యదర్శి పి.పీటర్‌, తాడేపల్లిగూడెం మండల అధ్యక్షుడు నాగరత్నాలు, కార్యదర్శి సన్నీ తదితరులు పాల్గొన్నారు.

భీమవరం: తుపాన్ల కారణంగా పంట నష్టపోయిన కౌలు రైతులను ఆదుకోవాలని ఏపీ కౌలు రైతుల సంఘం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా వ్యవసాయ అధి కారి పి.సునీతకు వినతిపత్రం అందజేశారు. అ నంతరం సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మా మిడిశెట్టి రామాంజనేయులు మాట్లాడుతూ జి ల్లాలో 90 శాతం వరి దెబ్బతినగా.. జిల్లాలో 80 శాతం మంది కౌలు రైతులే ఉన్నారన్నారు. ఇప్పటికే ఎకరాలకు రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టి నష్టపోయారన్నారు. ఈ క్రాప్‌ బుకింగ్‌లో ఎడిట్‌ ఆప్షన్‌ ఇచ్చి కౌలురైతుల పేరున పంట నష్టం నమోదు చేయాలని కోరారు. సూ ర్నీడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

తణుకు అర్బన్‌: ‘శివాలయాలకు దారేది మహాప్రభో’ శీర్షికన ‘సాక్షి’లో బుఽ దవారం ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. తణుకు పాతవూరు శివాలయంలో పే రుకున్న మురుగునీటిని మోటార్లతో తోడించి శుభ్రం చేయించే పనులు చేపట్టారు. అలాగే సజ్జాపురం శివాలయ రోడ్డును శుభ్రం చేయించారు. దీనిపై స్థానికులు, భక్తులు హర్షం వ్యక్తం చేశారు.

భీమవరం: జిల్లాలో తుపాన్ల ప్రభావంతో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లిదని కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో వ్యవసాయ, ప్రణాళిక, బీమా సంస్థల అధికారులతో ఆమె సమీక్షించారు. రానున్న రబీ సీజన్‌కు వరి విత్తనాల లభ్యత, సేకరణపై ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలన్నారు. వ్యవసాయశాఖ కమిషనర్‌ కార్యాలయం జాయింట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ (సస్యరక్షణ) ఎం.విజయభారతి, మార్టేరు వ్యవసాయ పరిశోధనాస్థానం శాస్త్రవేత్తలు డాక్టర్‌ ఎం.మల్లికార్జునరావు, డాక్టర్‌ ఎం. గిరిజారాణి, డాక్టర్‌ బీవీ రమణ తుపాను ప్రభావిత పంట పొలాలను క్షేత్రస్థాయిలో సందర్శించిన పరిస్థితులను వివరించారు. తుపాను ప్రభావంతో జిల్లాలో 1,98,043 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు అంచనా వేశారు.

వాణిజ్య పన్నుల వసూళ్లపై..

జిల్లాలో వాణిజ్య పన్నులను వేగంగా వసూలు చేసేందుకు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి సమీక్షించారు.

ఈవీఎం గోడౌన్‌ తనిఖీ

భీమవరం (ప్రకాశంచౌక్‌): స్థానిక పీపీ రో డ్డులోని ఏపీ స్టేట్‌ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ గోడౌన్స్‌లో భద్రపరిచిన ఈవీఎం యంత్రాలను కలెక్టర్‌ నాగరాణి తనిఖీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement