తుపాను బాధితులను ఆదుకోవడంలో విఫలం | - | Sakshi
Sakshi News home page

తుపాను బాధితులను ఆదుకోవడంలో విఫలం

Nov 12 2026 5:18 AM | Updated on Nov 12 2026 5:18 AM

తుపాను బాధితులను ఆదుకోవడంలో విఫలం

భీమవరం: తుపాను బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైఎస్సార్‌సీపీ భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు ధ్వజమెత్తారు. బుధవారం పట్టణంలో వరద ముంపునకు గురైన మెంటేవారితోటలో పర్యటించి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరుస తుపాన్లతో పట్టణంలో పలు ప్రాంతాలు ముంపునకు గురై 15 రోజులు దాటినా మురుగునీరు బయటకు వెళ్లకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. దుర్వాసన, అపారిశుద్ధ్యంతో రోగాల బారిన పడుతున్నారని, దోమలతో అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యనమదుర్రు కాలువ పొంగడంతో పలు వీధుల్లో ఇళ్లలోకి నీరు చేరిందని, కూటమి ప్రజాప్రతినిధులు మొక్కబడిగా పర్యటించడం తప్ప బాధితులకు ఒనగూరిన ప్రయోజనం ఏమీ లేదని విమర్శించారు. ముంపు నీరు బయటకు వెళ్లేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయలేదన్నారు. అలాగే కుళాయి నీరు కలుషితమవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. తాగడానికి నీరు, కంటి నిండా నిద్ర కరువై ప్రజలు అల్లాడుతున్నారని వాపోయారు. పార్టీ మహిళ జిల్లా అధ్యక్షురాలు కోడే విజయలక్షి, పార్టీ బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి కోడే యుగంధర్‌ మాట్లాడుతూ 15 రోజులుగా మెంటేవారితోటలోని పలు కాలనీల ప్రజలు మురుగు నీటిలోనే మగ్గిపోతున్నారని, చెత్త పేరుకుపోయినా అధికారులు కన్నెత్తి చూడటం లేదన్నారు. ముంపు ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేయాలని, బ్లీచింగ్‌ చల్లించి దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నాయకులు కామన నాగేశ్వరరావు, గాదిరాజు రామరాజు, ఇంటి సత్యనారాయణ, గుంటి ప్రభు, జంగం మాణిక్యాలరావు, నక్క అశోక్‌, రాజేంద్ర, వెంకట్‌ నాయుడు తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement