తాయిలాలు లేకుండానే విజయం | - | Sakshi
Sakshi News home page

తాయిలాలు లేకుండానే విజయం

Nov 5 2026 1:34 AM | Updated on Nov 5 2026 1:34 AM

నరసాపురం: దేశంలో ఎన్నికలంటే కోట్లు ఖర్చు చేయడం, ఓట్లు కొనుగోలు చేయడం పరిపాటిగా మారింది. నరసాపురం మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. అధికార పార్టీ అభ్యర్థి ఓట్లు, మద్యాన్ని ఏరులై పారించారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. ప్రత్యర్థులు కోట్లు వెచ్చిస్తున్నప్పటికీ... 32వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కొబమంచిలి సంతోష్‌రాణి (30) మాత్రం కేవలం నామినేషన్‌ ఖర్చులు మినహా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా బరిలో నిలిచారు. ఆటో డ్రైవర్‌ అయిన ఆమె తండ్రి జయరాజు గతంలో ఇదే వార్డు కౌన్సిలర్‌గా పనిచేస్తూ మరణించారు. అప్పటి నుంచి వలంటీర్‌గా పనిచేస్తూ సంతోష్‌రాణి ప్రజలకు సేవలందించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఇంటింటికీ తిరిగి, నా దగ్గర పంచడానికి డబ్బులు లేవు... నన్ను నమ్మి గెలిపిస్తే సేవ చేస్తాను అంటూ కన్నీళ్లతో ఓటర్లను అభ్యర్థించారు. డబ్బు రాజకీయాలను తిరస్కరించిన 32వ వార్డు ప్రజలు ఆమెను 26 ఓట్ల మెజారిటీతో గెలిపించారు. తాయిలాలకు లొంగకుండా ప్రజలు చూపిన ఈ విచక్షణ, ధన రాజకీయాలకు చెంపపెట్టు లాంటిదని రాజకీయ వర్గాలు ప్రశంసిస్తున్నాయి.

నరసాపురం 32వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సంతోష్‌రాణి విజయగాథ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement