ఏలూరు జీజీహెచ్‌లో ముంపు కష్టాలు | - | Sakshi
Sakshi News home page

ఏలూరు జీజీహెచ్‌లో ముంపు కష్టాలు

Nov 5 2026 1:34 AM | Updated on Nov 5 2026 1:34 AM

ఏలూరు టౌన్‌: ముసురు తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఏలూరు సర్వజన ఆసుపత్రికి (జీజీహెచ్‌) ప్రాంగణమంతా జలమయమైంది. ప్రధాన ద్వారం నుంచి పరీక్షా కేంద్రాల వరకు మురుగునీరు చేరడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా అత్యంత సున్నితమైన బ్లడ్‌బ్యాంకులోకి కూడా మురుగునీరు చేరడం పట్ల ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రికి వైద్యం కోసం వస్తే రోగాలు నయం కావడమేమో గానీ, అపరిశుభ్ర వాతావరణం వల్ల లేనిపోని రోగాల బారిన పడాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. ఆసుపత్రిలో సరైన డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల చిన్నపాటి వర్షానికే ముంపు సమస్య తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలోకి మురుగునీరు రాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని, నూతన ఆసుపత్రి భవన నిర్మాణ పనులను వెంటనే వేగవంతం చేసి రోగుల ఇబ్బట్లు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement