నేడే పరిషత్‌ పోరు | - | Sakshi
Sakshi News home page

నేడే పరిషత్‌ పోరు

Nov 5 2026 1:28 AM | Updated on Nov 5 2026 1:28 AM

Simultaneously Printed at Tadepalli Gudem | Vijayawada | Chennai | Delhi | Bangalore | Hyderabad | Mumbai | Anantapur | Guntur | Kadapa | Khammam | Karimnagar | Kurnool | Mahaboobnagar | Mangalagiri | Nalgonda | Nellore | Nizamabad | Ongole | Rajamahendravaram | Srikakulam | Tirupathi | Visakhapatnam | Warangal

న్యూస్‌రీల్‌

జిల్లా వ్యాప్తంగా ఓటర్ల వివరాలు

జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. గురువారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్‌ నిర్వహణకు సర్వం సిద్ధమైంది. జిల్లాల పునర్విభజన తర్వాత నూతన పశ్చిమ గోదావరి జిల్లాలో తొలిసారి పరిషత్‌ ఎన్నికలు జరుగుతున్నాయి.

సాక్షి, భీమవరం: జిల్లా పరిధిలో మొత్తం 20 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. 371 ఎంపీటీసీ స్థానాలకు 31 ఏకగ్రీవం కావడంతో మిగిలిన 340 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్‌ నిర్వహణకు 1244 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 396 పోలింగ్‌ కేంద్రాలు సమస్యాత్మక, అతి సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. పోలింగ్‌ పర్యవేక్షణ నిమిత్తం 176 ప్రాంతాల్లో మైక్రో అబ్జర్వర్లను నియమించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు 50 శాతం పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘా, మిగిలిన వాటిలో లోకేషన్‌ వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా పర్యవేక్షణకు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. అదనంగా వీడియో గ్రాఫర్లను కూడా నియమించామన్నారు. దాదాపు 9400 మంది పోలింగ్‌ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. వీరిలో 1,300 మంది ప్రిసైడింగ్‌ అధికారులు (పీఓ), 1,300 మంది అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులు (ఏపీఓ), 6,800 మంది ఇతర పోలింగ్‌ అధికారుల (ఓపీఓ)లను నియమించారు. ఎన్నికల విధులు, పోలింగ్‌ నిర్వహణ, బ్యాలెట్‌ పత్రాల వినియోగం తదితర అంశాలపై వీరికి శిక్షణ ఇచ్చారు. పోలింగ్‌ ప్రక్రియలో భాగంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు ఓటు వేసేందుకు ఒక్కో ఓటరుకు పింక్‌, వైట్‌ కలర్‌లోని రెండు బ్యాలెట్‌లను అందజేస్తారు.

మూడు చోట్ల స్ట్రాంగ్‌ రూమ్‌లు

సాయంత్రం పోలింగ్‌ ముగిశాక బ్యాలెట్‌ బాక్సులను భద్రపరిచేందుకు రెవెన్యూ డివిజన్లు వారీగా స్ట్రాంగ్‌ రూమ్‌లను ఏర్పాటు చేశారు. అక్కడే 7న కౌంటింగ్‌ నిర్వహించనున్నారు. భీమవరం డివిజన్‌ పరిధిలోని బ్యాలెట్‌ బాక్సులను భీమవరంలోని ఎస్‌ఆర్‌కేఆర్‌ కళాశాల, నరసాపురం రెవెన్యూ డివిజన్‌లోని బాక్సులను నరసాపురంలోని వైఎన్‌ కళాశాల, తాడేపల్లిగూడెం రెవెన్యూ డివిజన్‌లోని బాక్సులను ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో స్ట్రాంగ్‌ రూమ్‌లను ఏర్పాటుచేశారు.

వర్షాలతో తిప్పలు : మురసు తుపాను ప్రభావంతో బుధవారం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. జిల్లా అంతటా 315 సెం.మీ వర్షం కురిసింది. నరసాపురం, తాడేపల్లిగూడెం, మొగల్తూరు, పెనుమంట్ర, పాలకోడేరు తదితర చోట్ల 20 సెం.మీలకు పైబడి వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల నేపథ్యంలో పోలింగ్‌ సామాగ్రిని తీసుకువెళ్లే నిమిత్తం భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్‌ పాయింట్లకు చేరుకునేందుకు ఎన్నికల సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. మరోపక్క ఉండిలోని జెడ్పీ హైస్కూల్‌, పెనుమంట్ర మండలం వెలగలవారిపాలెంలోని పాఠశాల, తదితర చోట్ల ఏర్పాటుచేసిన పోలింగ్‌ కేంద్రాల్లోకి ముంపునీరు చేరడంతో పీఎస్‌లను మరో చోటికి మార్చినట్టు అధికారులు ప్రకటించారు.

ఏర్పాట్లు పూర్తి : జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు కలెక్టర్‌ చదలవాడ నాగరాణి తెలిపారు. భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్‌, ఉండి మార్కెట్‌ యార్డులో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌, కౌంటింగ్‌ కేంద్రాలను బుధవారం పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పోలింగ్‌ కేంద్రాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సీసీ కెమెరాలు, వీడియో కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని ఓటర్లందరూ ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములై ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్‌ కోరారు.

ఓటుకు వేళాయే

ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌

జిల్లావ్యాప్తంగా 10,52,927 మంది ఓటర్లు

1244 పోలింగ్‌ కేంద్రాలు

భారీ వర్షాలతో పోలింగ్‌ సిబ్బంది అవస్థలు

(ఏఐ సృష్టించిన చిత్రం)

పురుషులు : 5,20,721

మహిళలు : 5,32,195

ట్రాన్స్‌ జెండర్లు : 11

మొత్తం ఓటర్లు : 10,52,927

పోలింగ్‌ కేంద్రాలు : 1,244

జెడ్పీటీసీ స్థానాలు

20

పోటీలోని అభ్యర్థులు

67

ఎంపీటీసీ స్థానాలు

340

పోటీలోని అభ్యర్థులు

744

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement