21న ప్రత్యేక లోక్‌ అదాలత్‌ | - | Sakshi
Sakshi News home page

21న ప్రత్యేక లోక్‌ అదాలత్‌

Nov 5 2026 1:28 AM | Updated on Nov 5 2026 1:28 AM

21న ప్రత్యేక లోక్‌ అదాలత్‌

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌. శ్రీదేవి ఆధ్వర్యంలో ఈనెల 21న ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చెక్‌ బౌన్స్‌ కేసుల పరిష్కారానికి ప్రత్యేక లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్‌. శ్రీలక్ష్మి తెలిపారు. బుధవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా 10 వేలకు పైగా చెక్‌ బౌన్స్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు. ఈ కేసుల విచారణకు సుదీర్ఘ సమయం పడుతుంది కాబట్టి కక్షిదారులు సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. లోక్‌ అదాలత్‌ ద్వారా పూర్తయిన కేసులకు అప్పీలు ఉండదని, దీనివల్ల సమయం, డబ్బు ఆదా అవుతాయని పేర్కొన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement