జిల్లాలో ‘పరిషత్’ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు ఇంటింటా ప్రచారం ఉత్సాహంగా చేస్తున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు, గడప వద్దకే చేర్చిన సంక్షేమ కార్యక్రమాలను గుర్తుచేస్తున్నారు. మరోమారు అలాంటి సంక్షేమ పాలన రావాలంటే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. కూటమి ప్రభుత్వ రెండున్నరేళ్ల పాలనలో ఎదుర్కొంటున్న కష్టనష్టాలను వివరిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగుస్తున్న నేపథ్యంలో సోమవారం జిల్లావ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తించారు. – సాక్షి నెట్‌వర్క్


