పోలీసుల ఫ్లాగ్‌మార్చ్‌ | - | Sakshi
Sakshi News home page

పోలీసుల ఫ్లాగ్‌మార్చ్‌

Nov 3 2026 2:15 AM | Updated on Nov 3 2026 2:15 AM

పోలీసుల ఫ్లాగ్‌మార్చ్‌

అత్తిలి: స్థానిక సంస్థల ఎన్నికలను సజావుగా, ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించడమే ధ్యేయమని తాడేపల్లిగూడెం డీఎస్పీ బి.నరసింహారావు అన్నారు. మండలంలోని అత్తిలి, ఆరవల్లి గ్రా మాల్లో సోమవారం అత్తిలి ఎస్సై కేఎన్‌ విశ్వనాథ్‌ ఆ ధ్వర్యంలో ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ నరసింహారావు మాట్లాడుతూ ప్ర జాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు స్వేచ్ఛాయుత వా తావరణంలో జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించాలని, ఎన్నికల కోడ్‌ విధిగా పాటించాలన్నారు. చట్టాన్ని చేతిలోకి తీసుకోవడానికి ప్రయత్నించినా లేదా శాంతిభద్రతలకు భంగం కలిగించే కార్యకలాపాలకు పాల్పడినా ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ప్రజలంతా నిర్భయంగా ఓటేయాలని డీఎస్పీ నరసింహారావు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement