వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ధ్వజం
నరసాపురం రూరల్: కూటమి నాయకులు గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ము దునూరి ప్రసాదరాజు విమర్శించారు. సోమవారం మండలంలోని లిఖితపూడి, సరిపల్లి, మల్లవరం పెదలంక, మల్లవరం గ్రామాల్లో పార్టీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ భారీ బైక్‌ర్యాలీ, రోడ్ షో నిర్వహించారు. సరిపల్లి గ్రామం నుంచి సాగిన ర్యాలీ లిఖితపూడి, మల్లవరంలంక, మల్లవరం గ్రామాల మీదుగా సాగింది. అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మల్లవరంలోని వంగలదిబ్బ ప్రాంతంలో ప్రసాదరాజు విలేకరులతో మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి సామాన్యులు ఇబ్బంది పడుతుంటే.. ప్రకృతి వైపరీత్యాలను ఆపేస్తానంటూ సీఎం చంద్రబాబు ప్రగల్బాలు పలకడం హాస్యాస్పందమన్నారు. అర్నాబ్ తుపాను సంభవించి వారం రోజులు గడుస్తున్నా ఇప్పటికీ విద్యుత్ సరఫరాను పునరుద్ధరించలేదని విమర్శించారు. సంక్షేమం, అభివృద్ధి రెండింటికీ ప్రాధాన్యమిస్తూ పాలన సాగించిన పేదల పక్షపాతి మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని అన్నారు. అర్నబ్ తుపానుతో జిల్లాలో ప్రజ లు ముఖ్యంగా రైతులు దెబ్బతిన్నారని, ప్రభుత్వం వెంటనే బృందాలను రంగంలోకి దింపి నష్ట వివరాలు సేకరించాలని కోరారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రజలంతా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని కోరారు. కూటమి నాయకులు సూపర్‌సిక్స్ వంటి బూటకపు హామీలను ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. మాజీ జెడ్పీటీసీ బొక్కా రాధాకృష్ణ, దొంగ మురళీకృష్ణ, జెడ్పీటీసీ అభ్యర్థి యడ్లపల్లి ఉమాసుధ, ఎంపీటీసీ అభ్యర్థులు పులఖండం రామకృష్ణ, పెచ్చెట్టి లక్ష్మి, పులఖండం చిట్టిబాబు, చిన్నం వెంకట్, గమిడి మధుబాబు, బుడితి సుమన్, ఉంగరాల రమేష్ నాయుడు, డొక్కుమల్ల హెన్లీ, అడ్డాల నరసింహారావు, చినిమిల్లి చందు, గంటా విజయ్, బొక్కా త్రివేణి, మైల నరసింహం, పీతల రాజు, దేవగుప్త జగదీష్, బూసి చిట్టిబా బు, గూడూరు నాని తదితరులు పాల్గొన్నారు.


