న్యూస్‌రీల్
కూటమిలో గుబులు
అంతటా ఫ్యాన్ గాలి
స్వేచ్ఛగా ఓటు వేయాలి
తొలిదశ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం మున్సిపాలిటీ, ఆకివీడు నగర పంచాయతీలకు ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రెండు చోట్లా కలిపి 103 పోలింగ్ కేంద్రాల్లో 73,431 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
జనసేన ఎమ్మెల్యే ఎన్నికల కోడ్ ఉల్లంఘన
జిల్లాలో అర్నబ్‌తో తీరని నష్టం
ఆదివారం శ్రీ 1 శ్రీ నవంబర్ శ్రీ 2026
సాక్షి, భీమవరం: రాష్ట్ర ఎన్నికల కమిషన్ ముందుగా అక్టోబరు 28న పోలింగ్, 30న కౌంటింగ్ జరిగేలా షెడ్యూల్ విడుదల చేసింది. అయితే వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకుంటూ రాష్ట్రంలోని పలుచోట్ల కూటమి సాగించిన హింసాత్మక ఘటనలపై సుప్రీంకోర్టు సీరియస్ అవ్వడంతో ఈసీ షెడ్యూల్‌లో మార్పులు చేసింది. నవంబరు 1న పోలింగ్, 3న కౌంటింగ్‌గా నిర్ణయించింది.
హోరాహోరీగా ఎన్నికల రేసు
నరసాపురంలో చైర్‌పర్సన్ స్థానానికి త్రిముఖ పోటీ నెలకొంది. వైఎస్సార్‌సీపీ నుంచి కావలి రామసీత, జనసేన నుంచి కొత్తపల్లి శైలజ, కాంగ్రెస్ నుంచి తణుకొండ సంతోషకుమారి పోటీలో ఉన్నారు. ఇక్కడి 36 వార్డు కౌన్సిలర్ స్థానాలకు మొత్తం 91 మంది బరిలో నిలిచారు. వీరిలో వైఎస్సార్‌సీపీ–36, టీడీపీ–17, జనసేన–17, బీజేపీ–2, సీపీఐ(ఎం)–2, కాంగ్రెస్–1 కాగా 16 మంది స్వతంత్రులు ఉన్నారు.
ఆకివీడులో చైర్‌పర్సన్ స్థానానికి ముఖాముఖీ పోటీ ఉంది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా మన్నే లలితాదేవి, టీడీపీ అభ్యర్థిగా షేక్ నీలోఫర్ పోటీ పడుతున్నారు. మొత్తం 28 వార్డులకు గాను 9 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 19 వార్డులలో వైఎస్సార్‌సీపీ నుంచి 19 మంది, కూటమి పక్షాల నుంచి 19 మంది, ఇద్దరు స్వతంత్రులు బరిలో ఉన్నారు.
పటిష్ట భద్రత.. ఏర్పాట్లు పూర్తి
● నరసాపురంలో 46,996 మంది ఓటర్ల కోసం 71 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 11 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. 647 మంది సిబ్బంది, 20 మొబైల్ టీమ్‌లు, 10 మంది రూట్ ఆఫీసర్లు విధుల్లో ఉన్నారు. అర్నాబ్ తుపాను ప్రభావంతో నగరంలో విద్యుత్, సమాచార వ్యవస్థలకు అంతరాయం కలగడంతో.. 25 పోలింగ్ కేంద్రాలను కవర్ చేస్తూ 6 చోట్ల జనరేటర్లను ఏర్పాటు చేశారు.
● ఆకివీడులో 26,435 మంది ఓటర్ల కోసం 32 పోలింగ్ కేంద్రాలు ఉండగా వాటిలో 10 కేంద్రాలు సమస్యాత్మకంగా ఉన్నాయి. పట్టణంలో 250 మంది సిబ్బంది, 2 మొబైల్ టీమ్‌లు, 10 మైక్రో టీమ్‌లు, 7 గురు రూట్ ఆఫీసర్లు విధులు నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రానికి సిబ్బంది పోలింగ్ సామగ్రితో కేంద్రాలకు చేరుకున్నారు.
నరసాపురంలో ఎన్నికల సామగ్రి సరి చూసుకుంటున్న ఉద్యోగులు
ఆకివీడులో కవాతు నిర్వహిస్తున్న పోలీసులు
కలెక్టర్ చదలవాడ నాగరాణి
మున్సిపల్ ఎన్నికల్లో కూటమికి ఓటమి భయం పట్టుకుంది. చంద్రబాబు సీఎం, పవన్‌న్‌కల్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యి అప్పుడే 28 నెలలు పూర్తయ్యింది. వారికి మిగిలిన పదవీకాలం మరో 32 నెలలు మాత్రమే. ఇప్పటి వరకు కూటమి చెప్పిన ఆడబిడ్డ నిధి, నిరుద్యోగభృతి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్, డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ రాయితీ హామీలు పత్తాలేవు. కొత్త పింఛన్ ఒక్కటి కూడా ఇవ్వలేదు. పేదలకు ఇంటి స్థలాలు కూడా పంపిణీ చేయలేదు. ఒక్కరికి గృహనిర్మాణ సాయం మంజూరులేదు. ఆడబిడ్డి నిధి అమలు కాక జిల్లాలో అర్హత కలిగిన సుమారు 5,96,313 మంది మహిళలు రూ. 2415 కోట్లు నష్టపోయారు. నెలనెలా రూ. మూడు వేలు నిరుద్యోగభతి కోసం జిల్లాలోని వేల మంది నిరుద్యోగ యువత ఎదురుచూస్తు న్నారు. సర్కారు వైఫల్యంతో నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. బియ్యం 25 కేజీల బస్తా రికార్డు స్థాయిలో రూ. 2 వేలు దాటిపోయింది. పప్పులు, నూనెలు ఆకాశన్నంటి సామాన్యుల జీవనాన్ని దుర్భరంగా మార్చేశాయి. ప్రజల్లో గూడుకట్టుకున్న వ్యతిరేకత స్థానిక ఎన్నికల్లో తమకు చేటు చేస్తుందన్న ఆందోళనలో కూటమి వర్గాలు ఉన్నాయి. ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు పోటీలో నిలబడకుండా అడ్డుకోవాలని ఎక్కడికక్కడ కూటమినేతలు సామదాన దండోపాయలను ప్రయోగించారు.
మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో జిల్లాలో సంక్షేమం, అభివృద్ధిని పరవళ్లు తొక్కించారు. కులమత వర్గాలు, రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించారు. అమ్మ ఒడి, రైతు భరోసా, వైఎస్సార్ ఆసరా, చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం తదితర పథకాల రూపంలో ప్రతినెలా పేదలకు సాయం అందేంది. ఆరోగ్యశ్రీ రూపంలో ఆరోగ్యానికి, ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా పేద విద్యార్థులకు భరోసా ఉండేది. నిత్యావసర సరుకుల ధరలు అందుబాటులో ఉండేవి. ఎక్కడికక్కడ ప్రజలు నాటి పాలనను గుర్తుచేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా కూటమి దగాపై వ్యతిరేక పోస్టులు, కామెంట్స్ రూపంలో తమ అసంతృప్తిని తెలియజేస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో కూటమికి గుణపాఠం చెప్పేందుకు ఎదురుచూస్తున్నారు.
నిబంధనలు బేఖాతర్
వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని టార్గెట్ చేస్తూ ప్రచారం
ఓటుకు వేళాయె
మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
నరసాపురం చైర్మన్ రేసులో త్రిముఖ, ఆకివీడులో ముఖాముఖి పోరు
కూటమిని వణికిస్తున్న సూపర్‌సిక్స్ వంచన, నిత్యావసర ధరలు
రెండుచోట్లా తుఫ్యానేనని అంచనాలు
103 పోలింగ్ కేంద్రాల్లో ఓటుహక్కు వినియోగించుకోనున్న 73,431 మంది ఓటర్లు
పట్టణాల అభివృద్ధికి, సమర్థవంతమైన స్థానిక పాలనకు సరైన నాయకత్వాన్ని ఎన్నుకోవడంలో ప్రతి ఓటరు భాగస్వామి కావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, నిష్పక్షపాతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు అవసరమైన అన్ని వసతులు కల్పించామని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశామని స్పష్టం చేశారు.
– చదలవాడ నాగరాణి, జిల్లా కలెక్టర్


