వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులు అన్యాయం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులు అన్యాయం

Nov 1 2026 8:19 AM | Updated on Nov 1 2026 8:19 AM

వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులు అన్యాయం

ఏలూరు టౌన్‌: నగరంలో వైఎస్సార్‌సీపీ నాయకులపై టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడటంపై సమగ్ర విచారణ జరిపి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ, ఏలూరు పార్లమెంట్‌ పరిశీలకులు వంకా రవీంద్రనాథ్‌ డిమాండ్‌ చేశారు. ఏలూరు పత్తేబాద 3వ డివిజన్‌ ఇన్‌చార్జ్‌ యక్కల నాని, కార్పొరేటర్‌ అభ్యర్థి భర్త అనిల్‌కుమార్‌లపై శుక్రవారం సాయంత్రం జరిగిన దాడిలో గాయపడిన వారిని ఏలూరు జీజీహెచ్‌లో ఆయన పరామర్శించారు. అనంతరం ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్‌తో కలిసి జిల్లా ఎస్పీ శివకిషోర్‌ను కలసి వినతిపత్రం అందజేశారు. ఎన్నికలలో ఓడిపోతామనే భయంతోనే టీడీపీ దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా భద్రతా చర్యలు చేపట్టాలని ఎస్పీని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, కార్యదర్శి ఎస్‌కే సత్తార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement