వైఎస్సార్‌సీపీలోకి ఊపందుకున్న చేరికలు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలోకి ఊపందుకున్న చేరికలు

Oct 22 2026 1:15 AM | Updated on Oct 22 2026 1:15 AM

వైఎస్సార్‌సీపీలోకి ఊపందుకున్న చేరికలు

బుట్టాయగూడెం : కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, మోసపూరిత పాలనపై విసుగు చెందిన పలువురు నాయకులు, ప్రజలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు పేర్కొన్నారు. జీలుగుమిల్లి మండలం తాటియాకులగూడెం గ్రామ పార్టీ అధ్యక్షుడు నెరుసు నరేంద్ర ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో కూటమి పార్టీలకు చెందిన నాయకులు, శ్రేణులు వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్సార్‌సీపీ మండల పార్టీ అధ్యక్షుడు సందా ప్రసాద్‌, జిల్లా నాయకులు బోధ శ్రీనివాసరెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నేతలు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో నూటొక్క రకాల హామీలిచ్చి గద్దెనెక్కిన కూటమి సర్కార్‌, అధికారంలోకి వచ్చాక ప్రజలను నట్టేట ముంచిందని ధ్వజమెత్తారు. హామీలను అమలు చేయకుండా సొంత ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తుండటంతో పోలవరం నియోజకవర్గంలో అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి ప్రజలు, నాయకులు క్యూ కడుతున్నారని తెలిపారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో జరిగిన సంక్షేమం, మేలును నేడు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు గుర్తుచేసుకుంటున్నారని, జగనన్న పాలన మళ్లీ రావాలని ఆకాంక్షిస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ సిద్ధాంతాలకు ఆకర్షితులై తాటాకులగూడెంలో ఈ భారీ చేరికలు జరిగాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

జనసేనకు దెబ్బ

జంగారెడ్డిగూడెం (బుట్టాయగూడెం): జంగారెడ్డిగూడెం మండలంలో జనసేనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డుకు చెందిన కార్తీక్‌తో పాటు కట్టవపొదలవారిగూడేనికి చెందిన గంధం కాంతారావు వైఎస్సార్‌సీపీలో చేరారు. మచిలీపట్నం పార్లమెంట్‌ పరిశీలకుడు జెట్టి గురునాథరావు వారిద్దరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కార్తీక్‌ మాట్లాడుతూ.. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో కూటమి తరఫున జనసేన నుంచి 3వ వార్డు కౌన్సిలర్‌ టికెట్‌ ఆశించి టీడీపీ కార్యాలయంలో బయోడేటా ఇచ్చినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. కూటమిలో కాపులకు తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా, కేవలం గొడవలు చేసేవారికే పెద్దపీట వేస్తున్నారని ఆరోపించారు. జనసేనలో కొనసాగలేక, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో తాను లబ్ధి పొందానని, పార్టీ తనకు ఎప్పుడూ అండగా ఉంటుందన్న నమ్మకంతోనే వైఎస్సార్‌సీపీలో చేరినట్లు కార్తీక్‌ స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ పట్టణ, మండల అధ్యక్షులు కర్పూరం గవరయ్య గుప్త, ఓరుగంటి నాగేంద్ర, ఉభయగోదావరి జిల్లాల బూత్‌ కమిటీల కన్వీనర్‌ బీవీఆర్‌ చౌదరి, నాయకులు జెట్టి సత్య ఆదిత్య, ముప్పిడి శ్రీనివాసరావు, గొలుసు ప్రసాద్‌, గోపిశెట్టి ప్రసాద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement