నిండా ముంచేసి.. ఆశలు తుంచేసి.. | - | Sakshi
Sakshi News home page

నిండా ముంచేసి.. ఆశలు తుంచేసి..

Oct 30 2026 7:24 AM | Updated on Oct 30 2026 7:24 AM

రొయ్య రైతుకు నష్టం సాగు పెట్టుబడులు సుమారుగా.. ఈ జాగ్రత్తలు పాటించాలి వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా (హెక్టార్లలో..)

న్యూస్‌రీల్‌

రొయ్య రైతుకు నష్టం
తుపాను ప్రభావంతో విద్యుత్‌ అంతరాయాలతో ఆక్సిజన్‌ అందక చెరువుల్లో రొయ్యలు చనిపోతున్నాయి. దీంతో రైతులు హడావుడిగా పట్టుబడులు చేస్తున్నారు. 8లో u
నీటి ఎద్దడి.. తెగుళ్ల బెడద.. పెరిగిన సాగు ఖర్చులు.. ఎన్నో ఆటంకాలకు ఎదురొడ్డారు.. పగలనకా, రేయనకా రెక్కలు ముక్కలు చేసుకుని సాగుచేశారు.. రెండు వారాల్లో చేతికొచ్చే పంట కోసం ఎదురుచూస్తున్న రైతుల ఆశలపై అర్నబ్‌ తుపాను నీళ్లు చల్లింది. ఈదురుగాలులు, భారీ వర్షాలతో అపార నష్టాన్ని మిగిల్చింది. జిల్లాలో తుపాను మిగిల్చిన పంట నష్టంపై ‘సాక్షి’ గ్రౌండ్‌ రిపోర్ట్‌.

● విత్తనం ప్యాకెట్‌ రూ. 600

● నారుమడి నిమిత్తం ఐదు సెంట్ల స్థలంలో ఆకుమడి దమ్ము, విత్తనాలు చల్లేందుకు, ఎరువుకు రూ.2,000

● నాట్లు నిమిత్తం పొలాన్ని రెండు సార్లు దమ్ము చేసేందుకు రూ.3,500

● పట్టి తోలేందుకు రూ.600 ● గట్లు చెక్కేందుకు రెండు కూలీలు (కూలీ రూ.700 చొప్పున) రూ.1,400

● నాట్లు వేసేందుకు కూలీలకు రూ.5,000

● బస్తాన్నర యూరియా, ఒక డీఏపీ, 40 కేజీల పొటాష్‌లకు రూ.2,500, చల్లేందుకు కూలీ ఖర్చులు కూలీలు రూ.3,500

● కలుపు మందులు రూ.500, పురుగు మందులు రూ.2,500, కూలీ ఖర్చులు రూ.3,500

● పొలంలో నిలిచిన నీటిని అంతర్గత కాలువల ద్వారా తొలగించాలి.

● గింజలు రంగు మారడం, మాగుడు, మానిపండు తెగులు వ్యాపించకుండా ఎకరాకు 200 మి.లీ. ప్రోపికొనజోల్‌ పిచికారీ చేయాలి.

● వర్షాలు తగ్గిన తర్వాత బ్యాక్టీరియా ఎండాకు తెగులు కనిపిస్తే ప్లాంటోమైసిన్‌: 1 మి.లీ/లీటరు + కొసైడ్‌ (కాపర్‌ హైడ్రాకై ్సడ్‌) 2.0 గ్రా/లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

● నిలిచి ఉన్న లేదా పడిపోయిన చేలలో కంకిపై గింజ మొలకెత్తకుండా ఉండటానికి 5 శాతం ఉప్పు ద్రావణం (50 గ్రాములు కల్లుప్పు / లీటరు నీటికి) కలిపి పిచికారీ చేయాలి.

శురకవారం శ్రీ 30 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

మండలం నష్టపోయిన నేలవాలిన

రైతులు పంట

ఆచంట 4,025 4,070

ఆకివీడు 695 395

అత్తిలి 10,463 4,650

భీమవరం 2,652 2,432

గణపవరం 3,945 2,630

ఇరగవరం 4,550 4,680

కాళ్ల 1,420 1,150

మొగల్తూరు 420 263

నరసాపురం 3,546 2,210

పాలకోడేరు 4,200 4,412

పాలకొల్లు 6,205 3,745

పెంటపాడు 10,852 7,124

పెనుగొండ 4,975 4,855

పెనుమంట్ర 3,980 3,178

పోడూరు 7,500 4,251

తాడేపల్లిగూడెం 15,552 8,200

తణుకు 6,542 3,925

ఉండి 3,250 2,904

వీరవాసరం 4,912 4,534

యలమంచిలి 3,210 1,725

సాక్షి, భీమవరం : జిల్లాలోని 87 వేల హెక్టార్లలో ఖరీఫ్‌ సాగు చేశారు. సీజన్‌ ప్రారంభం నుంచి కర్షకులను కష్టాలు వెంటాడాయి. వర్షాభావ పరిస్థితులు, సాగునీటి ఎద్దడితో పలుచోట్ల నారుమడులు ఎండిపోయే పరిస్థితులు ఎదురయ్యాయి. ఒడిదుడుకులకు ఎదురొడ్డి పంటను కీలక దశకు చేర్చారు. ముందుగా నాట్లు వేసిన తాడేపల్లిగూడెం ప్రాంతంలో వరికోతలు మొదలయ్యాయి. అధిక శాతం విస్తీర్ణంలో పాలుపోసుకునే దశ నుంచి గింజ గట్టిపడే దశలో ఉంది. నవంబరు రెండో వారం నుంచి జిల్లా అంతటా వరి కోతలు మొదలుకానున్నాయి.

అర్నబ్‌ జలఖడ్గం : జిల్లావ్యాప్తంగా 303 గ్రామాల పరిధిలోని 1,02,939 మంది రైతులకు చెందిన 71,333 హెక్టార్లలో వరి పంట నేలకొరిగినట్టు వ్యవ సాయశాఖ ప్రాథమిక అంచనా. తాడేపల్లిగూడెం రూరల్‌, పెంటపాడు, అత్తిలి, ఇరగవరం, పెనుగొండ మండలాల్లో నష్టం తీవ్రత ఎక్కువగా ఉంది. డ్రెయిన్లు పొంగి ప్రవహిస్తుండటంతో చాలా చోట్ల వరి పంటపై నీరు నిలిచిపోయింది. క్షేత్రస్థాయి పరిశీలనలో ఈ నష్టం మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం పూతపై ఉన్న ఎంటీయూ 1318, పీఎల్‌ఏ 1100, తదితర రకాల్లో తాలుశాతం పెరిగి దిగుబడులు తగ్గిపోతాయని రైతులు అంటున్నారు. ఎక్కడికక్కడ రైతులు పొలాల్లో పంటను కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తూ కనిపించారు. ముంపు నీటిని బయటకు పంపేందుకు బాటలు చేసుకోవడం, నేలనంటిని చేలను పైకి నిలబెట్టి కట్టలుగా కట్టుకోవడం చేస్తున్నారు. మరికొందరు వ్యవసాయ అధికారులు వచ్చి పంట నష్టం పరిశీలించిన తర్వాత నష్టనివారణ చర్యలు చేపట్టాలని పొలాల వద్ద వేచి చూడటం కనిపించింది. పలుచోట్ల రైతు లు మాట్లాడుతూ పంట నేలనంటడంతో వరికోత యంత్రాల ద్వారా కోయడం సాధ్యం కాదని, కూ లీల ద్వారా కోయిస్తే చాలా ఖర్చవుతుందని వాపోయారు. 40 శాతం మేర దిగుబడి తగ్గిపోయి పంట పెట్టుబడులు కూడా రావని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం, ఇన్‌పుట్‌ సబ్సిడీ అందించాలని, తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కోరుతున్నారు.

అన్నదాత.. గుండెకోత.. తాడేపల్లిగూడెం రూరల్‌లో నేలనంటిన వరిచేలు

చివరికి ఖేదం

పది రోజుల్లో ఖరీఫ్‌ కోతలు

చివరిలో ముంచేసిన అర్నబ్‌

ఇప్పటికే ఎకరాకు రూ.25 వేల వరకు పెట్టుబడి

ప్రాథమిక అంచనా మేరకు 71,333 హెక్టార్లలో నేలకొరిగిన వరి

దిగుబడులు తగ్గిపోతాయనిరైతుల ఆందోళన

జిల్లాలో 87 వేల హెక్టార్లలో ఖరీఫ్‌ సాగు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement