బాధ్యతలు స్వీకరించిన డైరెక్టర్
తాడేపల్లిగూడెం: ఏపీ నిట్ డైరెక్టర్‌గా ప్రొఫెసర్ కేవీ కృష్ణారావు గురువా రం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇప్పటివరకు ముంబై ఐఐటీలో సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్‌గా సేవలందించారు. ఆయనకు రవాణా వ్యవస్థల ఇంజనీరింగ్, పట్టణ రవాణా ప్రణాళిక రంగాల్లో నాలుగు దశాబ్ధాలుగా పైగా బోధన, పరిశోధనా రంగాల్లో విశేష అనుభవం ఉంది. కాకినాడలోని జేఎన్‌టీయులో 1984లో సివిల్ ఇంజనీరింగ్, 1986లో మద్రాస్ ఐఐటీలో మాస్టర్స్, పీహెచ్‌డీ పూర్తిచేశారు. 1996లో ముంబై ఐఐటీలో చేరి ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. ఇక్కడ బాధ్యతలు స్వీకరించిన ఆయనకు రిజిస్ట్రార్ దినేష్ శంకరరెడ్డి, డీన్‌లు రవికిరణ్ శాస్త్రి, వి.సందీప్, ఎన్.జయరామ్, జీబి.వీరేష్‌కుమార్, హిమబిందు తదితరులు అభినందనలు తెలిపారు.
వీరవాసరం: తుపానుతో మండలంలో దెబ్బతిన్న వ్యవసాయ పంటలను జాయింట్ కలెక్టర్ కేఆర్ కల్పశ్రీ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తుపాను కారణంగా పంటలకు జరిగిన నష్టాన్ని స్వయంగా పరిశీలించి, ప్రభావిత ప్రాంతాల్లో పంటల పరిస్థితిని, నష్టం తీవ్ర తను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంట నష్టానికి గురైన రైతుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, నష్ట వివరాలు సేకరించాలని ఆదేశవించారు. అంచనాలు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఉండాలని, పంటల స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. అనంతరం మండలంలో తుపాను కారణంగా తెగిపడిన విద్యుత్ తీగలను, ఇతర నష్టం జరిగిన ప్రాంతాలను ఆమె పరిశీలించారు.
తణుకు అర్బన్: తణుకు మున్సిపాలిటీలోని 44 వార్డుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా కేటగిరీలకు సంబంధించిన ఓటర్ల తుది జాబితా విడుదల చేసినట్టు కమిషనర్ టి.రామ్‌కుమార్ తెలిపా రు. తుది జాబితాను తణుకు మున్సిపల్ కార్యాలయం, రెవెన్యూ కార్యాలయం, రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో ప్రదర్శించామన్నారు. పట్టణంలో పురుషులు 36,202, మహిళలు 39,260, ఇతరులు ముగ్గురు ఉన్నారు. ఎస్సీ వి భాగంలో పురుషులు 3,899, మహిళలు 4,451, ఎస్టీ విభాగంలో పురుషులు 320, మహిళలు 343, బీసీ విభాగంలో పురుషులు 14,704, మహిళలు 16,109, ఇతరుల్లో పురుషులు 17,279, మహిళలు 18,357 మంది ఉన్నారు.
భీమవరం: తుపాను ప్రభావానికి జిల్లాలోని 20 మండలాల పరిధిలో 1,83,311 ఎకరాల్లో వరి పంట దెబ్బతిందని జిల్లా వ్యవసాయాధికారి జి.సునీత తెలిపారు. జిల్లాలో పంటలపై తీవ్ర ప్రభావం చూపిన తుపాను ధాటికి పలు ఎకరా ల్లో వరి పంట నేలమట్టమైంది. మొత్తంగా జి ల్లాలో 304 గ్రామాల పరిధిలో 1,05,764 మంది రైతులు తమ పంటను నష్టపోయారని జిల్లా అధికారులు అంచనాలు తయారు చేశారు.
భీమవరం: రాష్ట్రంలో తుపానుతో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించి 24 గంటల్లో సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. జిల్లాలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో గురువారం ఆయన పర్యటించారు. దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు, రహదారులు, పంట పొలాలను పరిశీలించారు. పాలకొల్లు, భీమవరం, నరసాపురం ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించారు. అనంతరం భీమవరం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. తుపాను రాష్ట్ర విద్యు త్ వ్యవస్థకు సుమారు రూ.500 కోట్ల మేర నష్టం వాటిల్లిందన్నారు. జిల్లాలో సుమారు 3,700 విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నట్టు ప్రాథమికంగా గుర్తించామని, దాదాపు 400 గ్రా మాల్లో సరఫరాకు అంతరాయం ఏర్పడిందన్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ, ఉద్యాన పంటల నష్టాన్ని క్షేత్రస్థాయిలో అంచనా వేయాలని ఆదేశించారు. వివరాలు సేకరించి త్వరితగతిన ప్రభుత్వానికి నివేదిక అందించాలని మంత్రి ఆదేశించారు. కలెక్టర్ సీహెచ్ నాగరాణి, అధికారులు పాల్గొన్నారు.


