నాడు ప్రగతి.. నేడు అధోగతి | - | Sakshi
Sakshi News home page

నాడు ప్రగతి.. నేడు అధోగతి

Oct 30 2026 7:24 AM | Updated on Oct 30 2026 7:24 AM

వైఎస్సార్‌సీపీతోనే అభివృద్ధి

నరసాపురంలో అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ, మంచినీటి పైప్‌లైన్స్‌ లాంటి కీలక ప్రాజెక్ట్‌లు వైఎస్సార్‌ సీసీ హయాంలోనే మంజూరయ్యాయి. ఇంకా రూ.వందల కోట్ల అభివృద్ధి పనులు మంజూరు చేయించాం. అప్పటి ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు సహకారంతో గత కౌన్సిల్‌లో నేను వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌గా పనిచేయడంతో పూర్తి అవగాహన ఉంది. ఈ కూటమి ప్రభుత్వం మరో రెండున్నరేళ్లలో కచ్చితంగా మారిపోతుంది. మున్సిపల్‌ పీఠంపై వైఎస్సార్‌సీపీ ఉంటేనే ఆగిపోయిన అభివృద్ధి మళ్లీ జరుగుతుంది. ప్రజలు ఈ విషయాన్ని గమనించి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు అవకాశం కల్పించాలని కోరుతున్నా.

– కావలి రామసీత, వైఎస్సార్‌సీపీ

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థి, నరసాపురం

నరసాపురం: జిల్లాలో ప్రతిష్టాత్మకమైన నరసాపురం మున్సిపాలిటీ ఎన్నికలకు సిద్ధమైంది. వచ్చేనెల 1న ఎన్నికల పోలింగ్‌.. 3న కౌంటింగ్‌ జరగనుంది. మున్సిపాలిటీకి గత ప్రభుత్వంలో వైఎస్సార్‌సీపీ పాలకవర్గం ప్రాతినిధ్యం వహించింది. అప్పటి ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు సారథ్యంలో తొలిసారిగా మత్స్యకార సామాజికవర్గానికి చెందిన మహిళ బర్రి శ్రీవెంకటరమణ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. గత ప్రభుత్వంలో రెండున్నరేళ్లపాటు పట్టణంలో అభివృద్ధి పరుగులు పెట్టింది. అప్పుడు ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా ఉన్న ముదునూరి వందల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అప్పట్లోనే కొన్ని ప్రాజెక్టులు కూడా పూర్తిచేయించారు. 1956లో మున్సిపాలిటీ ఏర్పడగా ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి చేసి పట్టణ రూపురేఖలు మార్చా రు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వ చ్చిన నాటి నుంచి మున్సిపాలిటీలో అభివృద్ధి అ డ్డుకున్నారు. గత ప్రభుత్వం మంజూరు చేసిన ప్రా జెక్ట్‌లను మూలనపెట్టారు. మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా పట్టణంలో ఎక్కడ చూసినా ఇదే చర్చ జోరుగా జరుగుతోంది. మరో రెండున్నరేళ్లలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని.. మళ్లీ అప్పుడే నిలిచిపోయిన ప్రాజెక్టులు పట్టాలెక్కుతాయనే భావన అంతటా నెలకొంది.

వైఎస్సార్‌సీపీ పాలనలో అభివృద్ధి పరవళ్లు

రూ.వందల కోట్లతో నరసాపురం మున్సిపాలిటీలో పనులు

ప్రభుత్వం మారిన తర్వాత పట్టించుకోని కూటమి సర్కారు

మున్సిపల్‌ ఎన్నికల వేళ పట్టణంలో చర్చనీయాంశంగా అభివృద్ధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement