రెన్యువల్స్ కాని షాపులు
భీమవరం: జిల్లాలోని మద్యం విక్రయించే షా పులను తగ్గించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేందుకు సిండికేట్స్ రచించిన వ్యూహం ఫలించినట్టుగా కన్పిస్తోంది. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం వ్యాపారులకు కమీషన్ ఇవ్వడంలో మోసం చేయడంతో మద్యం షాపుల రెన్యువల్స్‌లో వ్యాపారులు సిండికేట్‌గా మారి షాపులను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగానే జిల్లాలో 25 షాపులను రెన్యువల్ చేయకుండా సిండికేట్ కట్టుదిట్టమైన పన్నాగం పన్నింది. మద్యం వ్యాపారుల నుంచి భారీగా ముడుపులు, షాపుల్లో భాగస్వామ్యం పొందుతున్న కొందరు ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు వ్యాపారులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక గతంలో ప్రభుత్వం నిర్వహించిన మద్యం షాపులను ప్రైవేట్ వ్యక్తులకు లాటరీ పద్ధతిలో కేటాయించింది. 2024 అక్టోబర్ నుంచి 2026 సెప్టెంబర్ నెలాఖరు వరకు రెండేళ్ల కాల పరిమితికి లాటరీ నిర్వహించింది.
జిల్లాలో 193 షాపులు
జిల్లాలోని భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం,నరసాపురం, పాలకొల్లు, ఆకివీడు ఎకై ్సజ్ స్టేషన్ల పరిధిలో 193 షాపులకుగాను 175 అన్ రిజర్వ్‌డ్, 18 కల్లుగీత కార్మికులకు కేటాయించారు. షాపుల గడువు సెప్టెంబర్ 30తో ముగియడంతో ప్రభుత్వం పాత షాపులనే ఏడాది పాటు రెన్యువల్‌కు అవకాశం కల్పించింది. అయితే నష్టపోయామనే సాకుతో వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి షాపులను తగ్గిండచం ద్వారా ఖర్చులు తగ్గించుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. దీనిలో భాగంగా జిల్లాలోని 193 షాపులకుగాను 168 షాపులను మాత్రమే రెన్యువల్స్ అయ్యాయి.
షాపులు ఇలా..
జిల్లాలో ఎకై ్సజ్ స్టేషన్ల వారీగా భీమవరంలో 44, ఆకివీడులో 25, తణుకులో 38, తాడేపల్లిగూడెంలో 40, నరసాపురంలో 27, పాలకొల్లులో 21 షాపులు ఉన్నాయి. షాపులకు అనుబంధంగా విచ్చలవిడిగా బెల్ట్‌షాపులు ఏర్పాటుచేయడంతో పాటు సమయపాలన, నిబంధనలు పాటించకుండా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఈ మేరకు బాటిల్ పై రూ.20 నుంచి రూ.100 వరకు అధికంగా వసూళ్లు చేస్తున్నారు.
అనుమానాలెన్నో..
25 షాపులకు 8 షాపులకు మాత్రమే దరఖాస్తులు రావడంతో వీటికి టెండర్లు ఖరారు చేస్తారో లేదో అనే అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. టెండర్లు ఖరారు కాకుంటే ప్రభుత్వమే నేరుగా షాపులు నిర్వహిస్తుందనే ప్రచారం జరుగుతోంది. అయితే దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 6వ తేదీ వరకు గడువు పొడించినట్టు ఎకై ్సజ్ శాఖ అధికారులు తెలిపారు.
భీమవరం స్టేషన్ పరధిలో 9, ఆకివీడులో 6, తణుకులో 5, తాడేపల్లిగూడెంలో 2, నరసాపురంలో 3 షాపులకు రెన్యువల్స్ కాలేదు. దీంతో ఆయా షాపులకు గతనెల 25న నోటిఫికేషన్ విడుదల చేశారు. గురువారం అర్ధరాత్రి వరకు దరఖాస్తులు గడువు ఇవ్వగా.. భీమవరం పరిధిలో రెండు, నరసాపురంలో మూడు, ఆకివీడు, పెనుగొండ, పెనుమంట్రలో ఒక్కొక్కటి చొప్పున మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. సిండికేట్ సభ్యులకు షాపులకు టెండర్లు వేయకుండా అడ్డుకుని తమ వ్యూహాం ఫలించేలా చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
వ్యూహం ఫలించేనా?
జిల్లాలో 25 షాపులకు నో రెన్యువల్
మరలా నోటిఫికేషన్ జారీ
8 షాపులకే దరఖాస్తులు
గడువు పెంచిన ఎకై ్సజ్ శాఖ


