తాడేపల్లిగూడెం : తమ గ్రామాన్ని పంచాయతీగానే ఉంచాలని, మున్సిపాలిటీలో కలపవద్దని తాడేపల్లిగూడెం మండలం కొండ్రుపోలు గ్రామస్తులు శు క్రవారం రాత్రి రోడ్డెక్కారు. విలీన గ్రామాలను ము న్సిపాలిటీలో కలిపి ఎన్నికలు నిర్వహించాలంటూ కోర్టు ఇచ్చిన తీర్పునకు నిరసనగా ఆందోళన చే పట్టారు. గత 12 ఏళ్లుగా గ్రామానికి పాలకవర్గం లేక ఎలాంటి అభివృద్దికి నోచుకోలేదన్నారు. కనీసం డ్రైన్లు శుభ్రం చేయడానికి నిధులు లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. గ్రామాన్ని మున్సిపాలిటీలో కలిపితే అంతా కూలీలుగా పనిచేసే ఉపాధి హామీ పని కూడా అందకుండా పోతుందన్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసు చొరవ తీసుకొని తమ గోడును ప్రభుత్వానికి విన్నవించాలని కోరారు.


