బీసీలకు కూటమి వెన్నుపోటు | - | Sakshi
Sakshi News home page

బీసీలకు కూటమి వెన్నుపోటు

Oct 3 2026 1:38 AM | Updated on Oct 3 2026 1:38 AM

బీసీలకు కూటమి వెన్నుపోటు

తణుకు అర్బన్‌: కూటమి ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి వెన్నుపోటు పొడిచిందని వైఎస్సార్‌సీపీ ఎంబీసీ విభాగ రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ ఎంబీసీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పెండ్ర వీరన్న ధ్వజమెత్తారు. శుక్రవారం తణుకులోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల స మయంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకోకుండా మళ్లీ నాటకాలాడుతోందని విమర్శించారు. సుప్రీంకోర్టుకు వెళ్లి రిజర్వేషన్లు తీసుకొస్తాం అని చెబుతూ బీసీ సమాజాన్ని మరోసారి వంచించేందుకు కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. బీసీలపై చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల ముందు 50 ఏళ్లు నిండితే పెన్షన్‌, బీసీ రుణాల హామీలు ఇచ్చారని కానీ రెండున్నరేళ్లు గడిచినా ఇంతవరకు ఏంచేశారని నిలదీశారు. మాయమాటలతో బీసీలను మోసం చేయడమే లక్ష్యంగా చంద్రబా బు ఉన్నారన్నారు. హైకోర్టు జడ్జిలుగా బీసీ వర్గానికి చెందిన జడ్జిలను కూడా రానివ్వలేదని, బీసీల తోకలు కట్‌చేస్తానని అన్నది మీరు కాదా అని చంద్రబాబును నిలదీశారు.

బీసీలకు జగన్‌ పెద్దపీట

50 శాతానికిపైగా బీసీలకు అనేక పదవుల్లో అవకాశం కల్పించి పెద్దపీట వేసిన చరిత్ర మాజీ ము ఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రమే దక్కుతుందని వీరన్న అన్నారు. బీసీ వర్గాలను గుండెల్లో పెట్టుకుని ఎన్నో పదవులు కట్టబెట్టారని గుర్తుచేశారు. బీసీ నాయకులు చొడే గోపీకృష్ణ, సప్పా బలరామకృష్ణ, బిరుదుకోట చింతన్న, యా రబాటి రామకృష్ణ, చింత సూర్యనారాయణ, పైడి సాయిసూర్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement