బాపూజీ స్ఫూర్తితో ముందుకు సాగాలి | - | Sakshi
Sakshi News home page

బాపూజీ స్ఫూర్తితో ముందుకు సాగాలి

Oct 3 2026 1:38 AM | Updated on Oct 3 2026 1:38 AM

బాపూజీ స్ఫూర్తితో ముందుకు సాగాలి జిల్లా పోలీస్‌ కార్యాలయంలో.. గూడెం డీఎస్పీగా నరసింహారావు ఖోఖో పోటీలకు ఎంపిక కాటేజీ అద్దె సొమ్ము జమ

భీమవరం (ప్రకాశంచౌక్‌): జాతిపిత మహాత్మా గాంధీజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతిఒక్కరూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని జేసీ కేఆర్‌ కల్పశ్రీ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో గాంధీ జయంతి నిర్వహించారు. బాపూజీ విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ ఆశయాలను ఆచరణలో పెట్టడం ద్వారా సమాజంలో శాంతి, సామరస్యం నెలకొల్పేందుకు కృషి చేయాలన్నారు. డీఆర్వో పి.గ్లోరియా, డీఈఓ అనిల్‌కుమార్‌, అధికారులు పాల్గొన్నారు.

భీమవరం: స్థానిక జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో గాంధీజీ, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకను నిర్వహించారు. అదనపు ఎస్పీ డి.విశ్వనాథ్‌ వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విశ్వనాథ్‌ మాట్లాడూతూ గాంధీ చూపిన సత్యం, అహింస మార్గాలు యావత్‌ ప్రపంచానికి ఆదర్శనీయమన్నారు. లాల్‌ బహదూర్‌శాస్త్రి నిరాడంబర జీవితం ఆయనిచ్చిన జై జవాన్‌.. జై కిసాన్‌ నినాదం దేశభక్తికి ప్రతీకని కొనియాడారు.జిల్లా ఆర్మర్డ్‌ రిజర్వ్‌ డీఎస్పీ ఎంవీవీ సత్యనారాయణ, సీఐ కె.వరప్రసాద్‌, ఈ.ఇందుమతి పాల్గొన్నారు.

తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెం డీఎస్పీగా బి.నరసింహారావు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడి డీఎస్పీ యు.రవిచంద్ర దిశ స్టేషన్‌కు బదిలీ అయ్యారు. నరసింహారావు గుంటూరు జిల్లాలో ఎస్సైగా, సీఐగా, ట్రాఫిక్‌లో, డీసీఆర్‌బీ క్రైమ్‌లో ఇలా పలు ప్రాంతాల్లో పనిచేశారు. గూడెం సబ్‌ డివిజన్‌లో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని, నేర నియంత్రణ, గంజాయి. డ్రగ్స్‌, సైబర్‌ నేరాలపై ఉక్కుపాదం మోపుతానని ఆయన అన్నారు. సబ్‌ డివిజన్‌ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

పాలకోడేరు : రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు పాలకోడేరు పీఎంసీ జూనియర్‌ కాలేజ్‌ విద్యార్థి ఎస్‌కే ధరణి ఎంపికయ్యాడు. ఈ నెల 16 నుంచి కృష్ణా జిల్లా కంచికచర్లలో జరిగే 45వ రాష్ట్రస్థాయి జూనియర్స్‌ ఖోఖో పోటీల్లో జిల్లా ప్రాతినిధ్యం వహిస్తాడని కోచ్‌ వనుం వెంకటేష్‌ తెలిపారు. ధరణి స్వగ్రామం మోగల్లు. గ్రామస్తులు అతడిని అభినందించారు.

ద్వారకాతిరుమల: చిన వెంకన్న కొండపై ఓ కాంట్రాక్టర్‌కు అనధికారికంగా రెండు రోజులపాటు ఉచితంగా కాటేజీని కేటాయించిన వ్యవహారంపై ‘సాక్షి’లో వరుస కథనాలు రావడంతో దేవస్థానం అధికారులు స్పందించారు. కాటేజీ అద్దె రూ.6,574ను సంబంధిత కాంట్రాక్టర్‌ ద్వారా శుక్రవారం ఉదయం దేవస్థానం ఖజానాకు జమ చేయించారు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో కాంట్రాక్టర్‌ ఎట్టకేలకు నగదు చెల్లించడం చర్చనీయాంశంగా మారింది. అమరావతికి చెందిన సెవెన్‌న్‌హిల్స్‌ ఫెసిలిటీ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన ఓ కాంట్రాక్టర్‌ శ్రీనివాస నిలయం గెస్ట్‌హౌస్‌లో ఉచితంగా బస చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement