భీమవరం: వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం గాంధీజీ జ యంతి వేడుకలు నిర్వహించారు. ముందుగా బా పూజీ చిత్రపటానికి శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు, భీమవరం నియోజకవర్గ కన్వీనర్ చినమిల్లి వెంకటరాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మోషేన్‌రాజు మా ట్లాడుతూ గాంధీ అనుసరించిన శాంతి, సత్యం అహింస మార్గాలు ఆదర్శనీయమన్నారు. గాంఽధీజీ అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. నాయకులు ఏఎస్ రాజు, వేండ్ర వెంకటస్వామి, గూడూరి ఉమాబాల, మేడిద జాన్సన్, పేరిచర్ల విజయనర్సింహరాజు, కామన నాగేశ్వరావు, తిరుమల విజయ్‌రామ్, కాండ్రేగుల నర్సింహారావు, గాది రాజు రామరాజు, చవ్వాకుల సత్యనారాయణ, చిగు రుపాటి సందీప్, బోకూరి విజయరాజు, బడుగు అశోక్‌బాబు, మానుకొండ ప్రదీప్, కోడె యుగందర్, కాటం స్టాలిన్ రాజు తదితరులు పాల్గొన్నారు.


