అంతర్‌ జిల్లా నేరస్తుడి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

అంతర్‌ జిల్లా నేరస్తుడి అరెస్ట్‌

Oct 3 2026 1:38 AM | Updated on Oct 3 2026 1:38 AM

తాడేపల్లిగూడెం : అంతర్‌ జిల్లా నేరస్తుడిని తాడేపల్లిగూడెం పోలీసులు చాకచక్యంగా అరెస్ట్‌ చేశారు. ఉభయ గోదావరితో పాటు బాపట్ల, గుంటూరు, విజయవాడ, నెల్లూరు, పల్నాడు, కడప జిల్లాలో 37 కేసులు ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టులో పెదకాకాని పరిధిలో జరిగిన ఓ చోరీ కేసులో జైలుకు కూడా వెళ్లివచ్చాడు. తాడేపల్లిగూడెంలో కారు చోరీ కేసులు అడ్డంగా బుక్కయ్యాడు. డీఎస్పీ బి.నరసింహారావు శుక్రవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం అంకంపాలెం గ్రామానికి చెందిన కరుటూరి సూర్యతేజ ఈనెల 27న రాత్రి పట్టణంలోని సాయిబాబా గుడి ఎదురుగా ఉన్న మెకానిక్‌ షెడ్‌లో ప్రవేశించి కా రును, నగదు, సీసీ టీవీ డీవీఆర్‌ను అపహరించా డు. ఈ మేరకు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం ఆస్మీ ఆదేశాల మేరకు పట్టణ సీఐ బోఽణం ఆదిప్రసాద్‌ బృందం దర్యాప్తు చేపట్టి ఉంగుటూరు టోల్‌ప్లాజా సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం నిందితుడిపై పెద్దాపురం, ఒంగోలులో చేసిన షట్టర్‌ పగులగొట్టి చేసిన చోరీలు బయటకు వచ్చాయి. తాడేపల్లిగూడెంలో నమోదైన కేసుకు సంబంధించి కారు, పెద్దాపురంలో కేసుకు సంబంధించి రూ.1,63,581, ఒంగోలులో కేసుకు సంబంధించి రూ.36 వేల నగదు, సీసీ కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. కారు విలువ సుమారు రూ.8 లక్షలు ఉంటుందన్నారు. చాకచక్యంగా వ్యవహరించిన సీఐ ఆదిప్రసాద్‌, కానిస్టేబుళ్లు ఎ.దుర్గాప్రసాద్‌, ఆర్‌.మోహన్‌, ఎంకే రామ్‌కుమార్‌, బి.చైతన్యలను అభినందించారు. ఎస్సై బాదం శ్రీనివాసు, నాగరాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement