‘హద్దులు’ దాటి ఇసుక అక్రమాలు | - | Sakshi
Sakshi News home page

‘హద్దులు’ దాటి ఇసుక అక్రమాలు

Oct 3 2026 1:38 AM | Updated on Oct 3 2026 1:38 AM

‘హద్దులు’ దాటి ఇసుక అక్రమాలు

చింతలపూడి: రాష్ట్రం నుంచి తెలంగాణకి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న లారీని చింతలపూడి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. చింతలపూడి మండల పరిధిలోని సీతానగరం గ్రామం వద్ద సీఐ క్రాంతికుమార్‌ పర్యవేక్షణలో ఎస్సై కె.సతీష్‌కుమార్‌ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టగా ఓ లారీ పట్టుపడింది. లారీ డ్రైవర్‌ పాత బిల్లులను చూపిస్తూ అక్రమంగా సరిహద్దు దాటించేందుకు ప్రయత్నించడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. వెంటనే రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించగా, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తున్నట్టు తేలింది. దీంతో సదరు లారీని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై సతీష్‌కుమార్‌ మాట్లాడుతూ అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సరిహద్దు గ్రామాల్లో నిరంతరం నిఘా కొనసాగుతుందని ఎస్సై చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement