పరిశుభ్రత అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

పరిశుభ్రత అందరి బాధ్యత

Oct 3 2026 1:38 AM | Updated on Oct 3 2026 1:38 AM

పరిశుభ్రత అందరి బాధ్యత

జేసీ కల్పశ్రీ

భీమవరం (ప్రకాశంచౌక్‌): పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని జేసీ కల్పశ్రీ అన్నారు. శుక్రవారం స్థానిక త్యాగ రాజ భవన్‌లో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర 2026 లో అవార్డు ప్రదానోత్సవం నిర్వహించారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, జేసీ కల్పశ్రీ హాజరై జిల్లాలో స్వచ్ఛత, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, పారిశుద్ధ్య నిర్వహణతో పాటు ప్రజల్లో స్వచ్ఛతపై అవగాహన కల్పించడంలో విశేష కృషి చేసిన వారికి అవార్డులను ప్రదానం చేశారు. స్వచ్ఛత అనేది కేవలం ప్రభుత్వ శాఖల బాధ్యత మాత్రమే కాదని, ప్రజల భాగస్వామ్యంతోనే పరిశుభ్రమైన స మాజాన్ని నిర్మించగలమని అన్నారు. ప్రతిఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పారిశుద్ధ్య కార్యక్రమాల్లో చురు గ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. అవార్డు గ్రహీతలను అభినందించి భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, అవార్డు గ్రహీతలు, ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement