బుట్టాయగూడెం: దర్భగూడెంలో ఇటీవల జరిగిన పి. వెంకయ్య హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేసు వివరాలను శుక్రవారం సీఐ బి. యాదగిరి మీడియాకు వెల్లడించారు. ఘటనపై చైతన్య ఇచ్చిన ఫిర్యాదుతో డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్, ఫింగర్ ప్రింట్స్ బృందాలతో దర్యాప్తు చేపట్టామన్నారు. గురువారం దర్భగూడెం సబ్‌స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న బి. అజయ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, నేరం ఒప్పుకున్నాడని చెప్పారు. మృతుడు వెంకయ్యకు, ముద్దాయి తల్లికి ఉన్న సంబంధం విషయంలో గొడవలు జరగడంతో అజయ్ గొడ్డలితో నరికి హత్య చేసినట్లు తేలింది. నిందితుడి నుంచి గొడ్డలిని స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. కేసును త్వరితగతిన ఛేదించిన ఎస్సైలు వి. క్రాంతికుమార్, చెన్నారావు, సిబ్బందిని సీఐ అభినందించారు.


