కాలువలో జారిపడి విద్యార్థి గల్లంతు | - | Sakshi
Sakshi News home page

కాలువలో జారిపడి విద్యార్థి గల్లంతు

Oct 3 2026 1:38 AM | Updated on Oct 3 2026 1:38 AM

కాలువలో జారిపడి విద్యార్థి గల్లంతు

ఇరగవరం: మండలంలోని ఇనపర్రు గ్రామానికి చెందిన కర్రి మోహన్‌ రెడ్డి (15) అనే బాలుడు చిక్కాల కాలువలో పడి గల్లంతయ్యాడు. తణుకు తిరుమల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న మోహన్‌ రెడ్డి, శుక్రవారం ఉదయం తన స్నేహితులతో కలిసి మార్నింగ్‌ వాక్‌కు వెళ్లాడు. ఉదయం 7 గంటల సమయంలో ముగ్గురమ్మల దేవాలయం సమీపంలోని చిక్కాల కాలువ వద్ద చేతులు కడుక్కుంటుండగా ప్రమాదవశాత్తు జారి కాలువలో పడిపోయాడు. స్నేహితులు అందించిన సమాచారంతో తండ్రి దామోదర్‌ రెడ్డి, గ్రామస్థులు గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభించలేదు. తండ్రి ఫిర్యాదు మేరకు ఇరగవరం పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement