తొలగించిన వైద్యులు
కాళ్ల: తీవ్ర శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న ఓ మహిళ ఊపిరితిత్తుల నుంచి కరక్కాయను లాప్రోస్కోపిక్ విధానం ద్వారా తొలగించినట్లు ఏలూరు మిత్ర హాస్పిటల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు డాక్టర్ విక్రాంత్ చుండూరి, డాక్టర్ సతీష్ కుమార్ తెలిపారు. దగ్గు నివారణకు సదరు మహిళ కరక్కాయ నోటిలో వేసుకోగా, పొలమారి అది ఊపిరితిత్తుల్లోకి చేరింది. దీంతో తీవ్ర శ్వాసకోశ ఇబ్బందితో ఆసుపత్రికి రాగా, వైద్యుల బృందం విజయవంతంగా లాప్రోస్కోపిక్ చికిత్స చేసి దానిని తొలగించింది. ప్రస్తుతం బాధితురాలు కోలుకుని ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు వివరించారు.
ద్వారకాతిరుమల: స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు–2026లో భాగంగా ద్వారకాతిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవస్థానం జిల్లా స్థాయి అవార్డుకు ఎంపికై ంది. స్వచ్ఛ దేవాలయాలు, ఆధ్యాత్మిక సంస్థల విభాగంలో ఈ పురస్కారం లభించింది. ఏలూరులోని సర్ సీఆర్ రెడ్డి డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి చేతుల మీదుగా దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాథరావు ఈ అవార్డును అందుకున్నారు. దేవస్థానంలో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రభుత్వ ఆధ్వర్యంలోని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఈ గుర్తింపునిచ్చిందని ఈఓ తెలిపారు.
ముదినేపల్లి రూరల్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత, సీపీఆర్ విధానాలపై శుక్రవారం ముదినేపల్లి వై–జంక్షన్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు. అనుకోకుండా ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన తక్షణ చర్యలు, సీపీఆర్ విధానంపై ప్రాక్టికల్ డెమో ద్వారా స్థానికులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రముఖ వైద్యుడు అంబుల మనోజ్, కై కలూరు పట్టణ, రూరల్ ఇన్స్పెక్టర్లు రామకృష్ణ, వి. రవికుమార్, ముదినేపల్లి, మండవల్లి, కలిదిండి, కై కలూరు రూరల్ ఎస్సైలు పాల్గొన్నారు.
పాలకోడేరు: గాంధీ జయంతి సందర్భంగా డ్రై డే నిబంధనల అమలులో భాగంగా ప్రోహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారులు శుక్రవారం జరిపిన దాడుల్లో అక్రమ మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. పాలకోడేరు గ్రామంలో దాడులు నిర్వహించి అతడి వద్ద నుంచి 27 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ ఇన్పెక్టర్ ఎ. బసంతి తెలిపారు. ఈ దాడుల్లో ఎస్సైలు పి. ఉమామహేశ్వరరావు, పి. సునీల్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
గణపవరం(నిడమర్రు): నిడమర్రు మండలం క్రొవ్విడి గ్రామంలో వీఆర్‌ఓపై దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు నిడమర్రు ఎస్సై లంకా రాజేష్ తెలిపారు. క్రొవ్విడి గ్రామంలో రైస్‌కార్డు దరఖాస్తు వెరిఫికేషన్ విషయంలో ఏర్పడిన వివాదం నేపథ్యంలో గ్రామ రెవెన్యూ అధికారిపై ఒకవ్యక్తి దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. వీఆర్‌ఓ ఫిర్యాదు మేరకు దాడిచేసి వ్యక్తిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తునట్లు తెలిపారు.


