గాంధీ భవనాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి | - | Sakshi
Sakshi News home page

గాంధీ భవనాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి

Oct 3 2026 1:38 AM | Updated on Oct 3 2026 1:38 AM

గణపవరం(నిడమర్రు): దేశంలోనే అతిపెద్దదైన పెదనిండ్రకొలను గాంధీ భవనాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని ఏపీ గాంధీ స్మారకనిధి కన్వీనర్‌ ఇందుకూరి ప్రసాదరాజు కోరారు. శుక్రవారం నిడమర్రు మండలం పెదనిండ్రకొలనులోని గాంధీ భవనంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాదరాజు మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధుడు చింతలపాటి మూర్తిరాజు ఆశయం మేరకు ఈ భవనాన్ని అభివృద్ధి చేసి, గాంధీజీ జీవిత స్మృతులను భావితరాలకు అందించేలా తీర్చిదిద్దాలన్నారు. అనంతరం గాంధీజీ జీవిత చరిత్రపై విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం పోటీల విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో సాగిరాజు జానకిరామరాజు, వేగేశ్న సుబ్బరాజు, ఆర్‌విఎస్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement