పెదవేగి: విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవాలని పెదవేగి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల కళాశాల ప్రిన్సిపల్ రమేష్ బాబు పిలుపునిచ్చారు. గురుకుల కళాశాలలో శుక్రవారం నిర్వహించిన 70వ రాష్ట్రస్థాయి చెస్, హాకీ, రగ్బీ విభాగాల్లో అండర్–17 బాలబాలికల క్రీడా పోటీలు ముగిశాయి. ఈ పోటీల ద్వారా జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు ఐదుగురు బాలురు, ఐదుగురు బాలికలను ఎంపిక చేసినట్లు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు తెలిపారు. వీరు అక్టోబర్ 22 నుంచి 26 వరకు జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.


