5 నుంచి న్యాయవాదుల విధుల బహిష్కరణ | - | Sakshi
Sakshi News home page

5 నుంచి న్యాయవాదుల విధుల బహిష్కరణ

Oct 3 2026 1:38 AM | Updated on Oct 3 2026 1:38 AM

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జిల్లాలోని అన్ని బార్‌ అసోసియేషన్ల పరిధిలో విధులను బహిష్కరించి, రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా ఫెడరేషన్‌ అధ్యక్షుడు కోనే సీతారామరావు తెలిపారు. ఏలూరు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా బార్‌ అసోసియేషన్ల అధ్యక్షుల సమావేశం శుక్రవారం నిర్వహించారు. రక్షణ చట్టం సాధించే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఈ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. అలాగే, న్యాయవాదుల మృతికి సంతాప సూచకంగా నిర్వహించే సభను మధ్యాహ్నం 3.30 గంటలకు బదులుగా ఉదయం 10.30 గంటలకే కోర్టు ప్రాంగణాల్లో నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశంలో నరసాపురం, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, నిడదవోలు, జంగారెడ్డిగూడెం బార్‌ అసోసియేషన్ల అధ్యక్షులు ఎన్‌. జ్ఞాననంద్‌, కే. అప్పిరెడ్డి, ఈ. గోపాలకృష్ణ, కై కారపు సత్యనారాయణ, జీఎస్‌ఆర్‌ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement