విద్యార్థులు నూతన ఆవిష్కరణలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు నూతన ఆవిష్కరణలు చేయాలి

Sep 28 2026 1:05 AM | Updated on Sep 28 2026 1:05 AM

భీమవరం: చింతలపాటి బాపిరాజు మెమోరియల్‌ ఉన్నత పాఠశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జిల్లా స్థాయి చెకుముకి సైన్స్‌ సంబరాలు–2026 ఘనంగా జరిగాయి. జిల్లావ్యాప్తంగా 35 జట్లు ఉత్సాహంగా పాల్గొన్న ఈ పోటీల్లో భాగంగా తొలుత మండల విద్యాశాఖ అధికారి కేఎస్‌ సీహెచ్‌ సాయిరాం, జేవీవీ నాయకులు వీరాస్వామి పతాకాలను ఆవిష్కరించి సైన్స్‌ టాలెంట్‌ టెస్ట్‌ను ప్రారంభించారు. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ సభకు చెకుముకి జిల్లా కన్వీనర్‌ రేపాక వెంకన్నబాబు అధ్యక్షత వహించగా, డీఎన్‌ఆర్‌ కళాశాల అసోసియేషన్‌ జాయింట్‌ సెక్రటరీ కె. రామకృష్ణంరాజు ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలు ఇదే స్ఫూర్తితో నూతన ఆవిష్కరణలు చేసి భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు.

విజేతల వివరాలు ఇలా..

ఈ పోటీల్లో ప్రభుత్వ పాఠశాలల విభాగంలో భీమవరంలోని శ్రీ ఉమా సోమేశ్వర మున్సిపల్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రథమ స్థానం సాధించగా, కస్పా పెంటపాడు జెడ్పీ ఉన్నత పాఠశాల ద్వితీయ, మార్టేరు బీడీ జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల తృతీయ స్థానాలను దక్కించుకున్నాయి. అలాగే ప్రైవేట్‌ పాఠశాలల విభాగంలో పాలకొల్లు ఆదిత్య స్కూల్‌ ప్రథమ, పెదఅమిరం వెస్ట్‌ బెర్రీ ఉన్నత పాఠశాల ద్వితీయ, ఆకివీడు విజ్ఞాన్‌ ఇంగ్లీష్‌ మీడియం ఉన్నత పాఠశాల తృతీయ స్థానాల్లో నిలిచాయి. విజేతలకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. ఇందులో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థులు నవంబరు 1 నుంచి జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. శ్రీనివాసరావు, విశ్రాంత డీఈఓ ఐఎస్‌ఎస్‌. ప్రసాదరాజు, జేవీవీ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జామాను రామలక్ష్మణరావు, మల్లుల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement