ఆక్వా రైతుల పోరుబాట | - | Sakshi
Sakshi News home page

ఆక్వా రైతుల పోరుబాట

Sep 9 2026 3:22 AM | Updated on Sep 9 2026 3:22 AM

న్యూస్‌రీల్‌

కోర్టు ఉత్తర్వులు ఉన్నా..

సాగుకు దూరం

సిండికేట్‌గా ఫీడ్‌, ప్రాసెసింగ్‌ కంపెనీలు

క్రాప్‌ హాలిడేకు సిద్ధం

ఫీడ్‌ ధరలు తగ్గించకుంటే అక్టోబర్‌ నుంచి ‘క్రాప్‌ హాలిడే’

అమలాపురం సదస్సులో ఏకగ్రీవ తీర్మానం

ప్రభుత్వ వైఖరిపై తీవ్ర ఆగ్రహం

బుధవారం శ్రీ 9 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

భీమవరం: ఆక్వా ఫీడ్‌ ధరల పెంపును నిరసిస్తూ రాష్ట్రంలోని ఆక్వా రైతులు మరోసారి ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఈ నెలాఖరులోగా మేత ధరలు తగ్గించకపోతే, అక్టోబర్‌ నుంచి ఫీడ్‌ కంపెనీల మందులు, మేత కొనుగోళ్లను నిలిపివేయాలని అమలాపురంలో నిర్వహించిన ‘రాష్ట్రస్థాయి ఆక్వా రైతు బతుకుపోరాటం’ సదస్సులో తీర్మానించారు. అవసరమైతే ‘క్రాప్‌ హాలిడే’ ప్రకటించేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు.

అప్సడా చట్టానికి విరుద్ధంగా ధరల పెంపు

రైతులకు యూనిట్‌ విద్యుత్‌ను రూ.1.50 సబ్సిడీకే అందిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన కొద్ది రోజులకే, ఫీడ్‌ కంపెనీలు మేత ధరలను విపరీతంగా పెంచాయి. ‘ఆంధ్రప్రదేశ్‌ ఆక్వాకల్చర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ’ (అప్సడా) చట్టం ప్రకారం ఫీడ్‌ కంపెనీలు, ఆక్వా రైతులు, రైతు సంఘాలతో చర్చించిన తర్వాతే ధరలపై నిర్ణయం తీసుకోవాలి. కానీ, చట్టాన్ని ఉల్లంఘిస్తూ కంపెనీలు ఏకపక్షంగా ధరలు పెంచినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ముడిసరుకుల సాకుతో ఏకపక్ష పెంపు

ఆక్వా ఫీడ్‌ తయారీకి ఉపయోగించే ముడిసరుకుల ధరలు పెరిగాయనే నెపంతో, ఏప్రిల్‌ 30న వెనామీ ఫీడ్‌పై టన్నుకు రూ.12 వేలు, టైగర్‌ ఫీడ్‌పై రూ.14 వేలు పెంచేందుకు అనుమతి ఇవ్వాలని తయారీ కంపెనీలు ప్రభుత్వాన్ని కోరాయి. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి రాకుండానే మే 11 నుంచి ఏకపక్షంగా ధరలను పెంచేశాయి. కంపెనీల నిర్ణయంపై రైతులు ఆందోళనకు దిగడంతో, పెంచిన ధరలో కిలోకు రూ.4 చొప్పున తగ్గించాలని ప్రభుత్వాధికారులు ఆదేశించారు. కానీ, కంపెనీలు మాత్రం కేవలం రూ.2 మాత్రమే తగ్గించి చేతులు దులుపుకున్నాయి. వాస్తవానికి, ‘ఆంధ్రప్రదేశ్‌ ఆక్వాకల్చర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ’ (అప్సడా) చట్టం ప్రకారం ఫీడ్‌ కంపెనీల యజమానులు, ఆక్వా రైతులు, రైతు సంఘాల నేతలతో చర్చించి వారి అంగీకారంతోనే ధరలు సవరించాలి. కానీ, ఈ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. దీనికి తోడు, ధరల పెంపుపై అధ్యయన కమిటీని ఏర్పాటు చేసి, ప్రతి 45 రోజులకోసారి సమీక్ష నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

ఫీడ్‌ కంపెనీల ఏకపక్ష నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. పాత ధరలకే మేత విక్రయించాలని కోర్టు స్టే ఇచ్చినా కంపెనీలు పట్టించుకోవడం లేదు. ఉత్తర్వులు అమలు చేయకపోతే కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేస్తాం. ప్రభుత్వం స్పందించి ధరలు తగ్గించకపోతే రైతులకు ‘క్రాప్‌ హాలిడే’ తప్ప మరో మార్గం లేదు.

– మళ్ల తులసీరామ్‌ (రాంబాబు), ఆక్వా రైతు

మేత ధరల పెంపుతో పెట్టుబడి వ్యయం విపరీతంగా పెరిగింది. దీనికి తోడు తెగుళ్ల వ్యాప్తి, నిలకడ లేని మార్కెట్‌ ధరలతో తీవ్రంగా నష్టపోతున్నాం. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఫీడ్‌ ధరలను అదుపు చేయాలి. రొయ్యలకు మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోకపోతే సాగును పూర్తిగా నిలిపివేయాల్సి వస్తుంది.

– భోగిరెడ్డి శ్రీనివాసరావు, ఆక్వా రైతు

మరోవైపు రొయ్యల ఫీడ్‌, ప్రాసెసింగ్‌ కంపెనీలు సిండికేట్‌గా మారి రైతులను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. జిల్లాలో సుమారు 1.80 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతుండగా, అందులో 80 వేల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతోంది. ఏడాదికి దాదాపు 3 లక్షల టన్నుల మేత వినియోగిస్తున్నారు. ఇష్టారాజ్యంగా పెరిగిన మేత ధరలు, రొయ్యలకు సోకే తెగుళ్లు, మార్కెట్‌లో సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో సాగు భారం మూలిగే నక్కపై తాటిపండు పడినట్లయింది.

తాము ఏడాదికి మూడు లక్షల టన్నుల మేత వినియోగిస్తున్నామని ఆక్వా రైతులు చెబుతున్నారు. ధర పెంపుతో రైతులపై విపరీతమైన ఖర్చు పెరగడంతో రొయ్యలసాగు కష్టమనే నిర్ణయానికి వచ్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయపార్టీలకు అతీతంగా రైతులంతా ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వం ధరల తగ్గింపునకు చర్యలు తీసుకోకుంటే వచ్చే నెలల నుంచి ఫీడ్‌ కంపెనీల మందులు కొనుగోలు చేయకూడదనే నిర్ణయానికి వచ్చారు. అవసరమైతే క్రాప్‌ హాలీడేకు సిద్ధం కావాలని తీర్మానం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement