పారదర్శకంగా భూముల రీ–సర్వే | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా భూముల రీ–సర్వే

Sep 9 2026 3:22 AM | Updated on Sep 9 2026 3:22 AM

మరో ఐదుగురి అరెస్ట్‌ పారదర్శకంగా భూముల రీ–సర్వే

మరో ఐదుగురి అరెస్ట్‌
మత్తు కోసం ఉపయోగించే ట్రామడాల్‌ ఇంజెక్షన్లను అక్రమంగా కొనుగోలు చేసి, వైద్యుల ప్రిస్క్రిప్షన్‌ లేకుండా విక్రయిస్తున్న కేసులో మరో ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. 8లో u

భీమవరం (ప్రకాశంచౌక్‌): జిల్లాలో చేపడుతున్న భూముల రీ–సర్వే ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ సమావేశ మందిరంలో మంగళవారం రీ–సర్వేపై నిర్వహించిన రెవెన్యూ వర్క్‌షాప్‌లో జాయింట్‌ కలెక్టర్‌తో కలిసి ఆమె పాల్గొని మాట్లాడుతూ భూముల కొలతలు, సరిహద్దుల నిర్ధారణ, యజమానుల వివరాల నమోదులో సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ పి.గ్లోరియా, ఆర్డీఓలు సూర్యనారాయణ, దాసి రాజు, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, జిల్లా సర్వే అధికారి కె.జాషువా తదితరులు పాల్గొన్నారు.

మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి

జిల్లాలోని మహిళలను నూరు శాతం అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ చదలవాడ నాగరాణి ఆదేశించారు. భీమవరం మున్సిపల్‌ కార్యాలయంలో వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన 60వ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో గుర్తించిన 52,700 మంది నిరక్షరాస్య మహిళలకు చదువు చెప్పించేందుకు 5,280 మంది వలంటీర్లను నియమించినట్లు తెలిపారు. మంగళవారం నుంచే ప్రత్యేక తరగతులు ప్రారంభించి వారికి చదవడం, రాయడం నేర్పించాలని సూచించారు. అనంతరం వలంటీర్లకు అధ్యయన సామగ్రిని, వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను కలెక్టర్‌ అందజేశారు. వయోజన విద్యాశాఖ నోడల్‌ అధికారి కేవీవీ సత్యనారాయణ, డీఆర్‌డీఏ పీడీ వేణుగోపాల్‌, మెప్మా పీడీ హెప్సిబా, డ్వామా ఏపీడీ స్వాతి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement