న్యూస్‌రీల్
3వ తేదీ నాటికి డిజిటలైజ్ వివరాలు
పక్కదారి పడుతున్న మట్టి
నూజివీడు మండలంలో పొలం మెరక నిమిత్తం మట్టి కోసం అనుమతులు తీసుకొని చెరువు మట్టిని తవ్వి యథేచ్ఛగా విక్రయిస్తూ టీడీపీ నేతలు జేబులు నింపుకుంటున్నారు. 8లో u
శనివారం శ్రీ 4 శ్రీ జూలై శ్రీ 2026
సాక్షి, భీమవరం: ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ఇంటింట సర్వేకు మరో పదిరోజులు మాత్రమే గడువుంది. జిల్లాలోని ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారం(ఈఎఫ్)లు పంపిణీ 99.7 శాతం పూర్తయినట్టు అధికారులు చెబుతున్నారు. ఓటర్లు వివరాల డిజిటలైజేషన్ జరిగింది కేవలం 39 శాతం మాత్రమే. ఈ నెల 14వ తేదీలోగా డిజిటలైజేషన్ చేయించుకోకపోతే ఓటు గల్లంతేనని నిపుణులు చెబుతున్నారు. జూన్ 15 నుంచి ఓటరు సమగ్ర సర్వే మొదలైంది. ఈ నెల 14 వరకు బూత్ లెవల్ ఆఫీసర్లు(బీఎల్‌ఓ) ఇంటింటికి వచ్చి ప్రతి ఓటరుకు ఈఎఫ్‌లు అందజేయాలి. 2002 జాబితా ప్రకారం ప్రస్తుతం ఆ నివాసంలో ఓటరు ఉంటున్నారా? లేదా? అనేది పరిశీలించాలి. కొన్నిచోట్ల బీఎల్‌ఓలు ఇంటింటికి వెళ్లకుండా ఒక చోటుకి పిలిచి ఫాంలు అందజేస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లాలోని 1.471 పోలింగ్ కేంద్రాల్లో 14,75,036 మంది ఓటర్లు ఉండగా 10,84,974 ఓట్లు మ్యాపింగ్ అయ్యాయి. 3,90,062 ఓట్లు మ్యాపింగ్ కాలేదు. వీటిలో అత్యధికంగా భీమవరంలో 81,282 ఓట్లు, తాడేపల్లిగూడెంలో 66,064, ఉండిలో 61,160, తణుకులో 52,047, పాలకొల్లులో 45,727, ఆచంటలో 44,782, నరసాపురంలో 39,050 ఓట్లు మ్యాపింగ్ చేయాల్సి ఉంది.
నత్తనడకన డిజిటలైజేషన్
శుక్రవారం నాటికి జిల్లాలో 14,70,603 మంది ఓటర్లకు ఈఎఫ్‌లు అందజేయడం ద్వారా 99.7 శాతం లక్ష్యాన్ని చేరుకున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఉండిలో నూరుశాతం లక్ష్యం చేరుకున్నట్టు ఉంది. ఎన్యుమరేషన్ ఫారాల్లో ఓటర్లు ఇచ్చిన వివరాలను బీఎల్‌ఓలు డిజిటలైజ్ చేయాలి. ఇంతవరకు కేవలం 6,56,126 ఓట్లతో కేవలం 44.48 శాతం మాత్రమే డిజిటలైజ్ అయ్యాయి. అత్యధికంగా తణుకులో 50.43 శాతం ఓట్లు డిజిటలైజ్ చేయగా ఆచంటలో 50.11 శాతం, పాలకొల్లులో 48 శాతం, నరసాపురంలో 44.36 శాతం, తాడేపల్లిగూడెంలో 43.57 శాతం, ఉండిలో 41.26 శాతం, భీమవరంలో 36.23 శాతం ఓట్లు చేశారు. ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ, డిజిటలైజ్‌కు ఈనెల 14వ వరకు మాత్రమే గడువుంది. రానున్న పదిరోజుల్లో మిగిలిన 55.52 శాతం ఓట్లను డిజిటలైజ్ చేయాల్సి ఉంది. ఇంటింట సర్వే అనంతరం బీఎల్‌ఓలు తొలగించిన ఓట్లు, కొత్తగా నమోదైన ఓట్లు, మార్పులు, చేర్పుల వివరాలతో జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురిస్తారు. ఆ తరువాత అందిన క్లెయింలు, అభ్యంతరాలు స్వీకరించి వాటిని సెప్టెంబరు 18లోగా పరిష్కరిస్తారు. అనంతరం సెప్టెంబరు 22న తుది ఓటరు జాబితాను ప్రచురిస్తారు.
నియోజకవర్గం మొత్తం ఈఎఫ్‌లు డిజిటలైజ్
ఓట్లు ఇచ్చినవి అయినవి
ఆచంట 1,79,987 1,79,828 90,192
పాలకొల్లు 1,95,062 1,93,115 92,938
నరసాపురం 1,71,053 1,70,575 75,877
భీమవరం 2,52,549 2,51,209 91,492
ఉండి 2,26,503 2,26,501 93,465
తణుకు 2,35,359 2,35,053 1,18,700
తాడేపల్లిగూడెం 2,14,523 2,14,322 93,462
జిల్లాలో 14.75 లక్షల మంది ఓటర్లు
99.7 శాతం మందికి ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చేశామంటున్న అధికారులు
తిరిగి బీఏల్‌ఓల చేతికి వచ్చినవి 38 శాతం మాత్రమే
ఆ మేరకు డిజిటలైజేషన్ పూర్తి
14వ తేదీతో ముగుస్తున్న గడువు


