ఆక్వా రిజిస్ట్రేషన్లలో అలసత్వం
ఆక్వారంగంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అప్సడా’ చట్టం–2020 అమలు నత్తనడకన సాగుతోంది. 8లో u
ద్వారకాతిరుమల: సర్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఓటర్లకు అందిస్తున్న ఎన్యూమరేషన్ ఫారంలోని కాలమ్–1లో 2002 నాటి వివరాలను నమోదు చేసే విషయంలో ఓటర్లు అయోమయానికి గురవుతున్న అంశంపై సాక్షి దినపత్రికలో శుక్రవారం ‘ఇదేంటి సర్’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనిపై తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి స్పందించి వివరణ ఇచ్చారు. అందులో భాగంగా సీహెచ్ పోతేపల్లిలోని సచివాలయంలో స్థానిక వైఎస్సార్ సీపీ ప్రతినిధుల సమక్షంలో ఓటరు జాబితాను పరిశీలించారు. జాబితాలోని 1,024 మంది ఓటర్లలో 641 మందికి ఒకే ఎపిక్ నంబర్ నమోదై ఉండడాన్ని గుర్తించామన్నారు. 2025 ఓటరు జాబితా నాటికి ప్రతి ఓటరుకి ప్రత్యేక ఎపిక్ నంబర్లు కేటాయించి లోపాన్ని పూర్తిగా సరిచేసినట్టు పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ నేత యాచమనేని నాగేశ్వరరావు మాట్లాడుతూ 2025 ఓటరు జాబితా సక్రమంగా ఉన్నప్పుడు, ఎన్యూమరేషన్ ఫాంలో 2002 నాటి ఎపిక్ నెంబర్లు ఎందుకు నమోదు చేయమంటున్నారని ప్రశ్నించారు.


