హోరాహోరీగా టెన్నిస్‌ సెమీఫైనల్స్‌ | - | Sakshi
Sakshi News home page

హోరాహోరీగా టెన్నిస్‌ సెమీఫైనల్స్‌

Mar 20 2026 7:49 AM | Updated on Mar 20 2026 7:49 AM

టెన్నిస్‌ ఆడుతున్న క్రీడాకారులు

భీమవరం : స్థానిక కాస్మోపాలిటన్‌ క్లబ్‌ ఆవరణలో ఆల్‌ ఇండియా సీనియర్‌ ర్యాంకింగ్‌ టెన్నిస్‌ ఛాంపియన్షిప్‌ పోటీల సెమీఫైనల్స్‌ హోరాహోరీగా సాగుతున్నాయి. గురువారం నిర్వహించిన పోటీల్లో పలువురు విజేతలుగా నిలిచారు.

సింగిల్స్‌ విభాగంలో..

70+ ఫైనల్స్‌లో కె.రాధాకృష్ణమూర్తిపై 6–4, 6–4 పాయింట్లతో ఎస్‌.సేతు విజేతగా నిలిచారు.

65+ విభాగంలో ఎస్‌.ఆనంద్‌ స్వరూప్‌పై వి.శ్రీనివాసరెడ్డి 6–3, 6–4 పాయింట్లతో విజయం సాధించారు.

55+ విభాగం సెమీఫైనల్స్‌లో సీహెచ్‌ శివపై 6–1, 6–0 పాయింట్ల తేడాతో కేవీఎన్‌ మూర్తి, బాబు రాజాపై 6–4, 6–3 పాయింట్ల తేడాతో డి.సుధాకర్‌రెడ్డి గెలుపొందారు.

45+ సెమీఫైనల్స్‌పై కె.సంపత్‌ కుమార్‌పై ఎంవీఎల్‌ఎన్‌ రాజు 6–3, 7–5 తేడాతో గెలుపొందారు.

35+ సెమీఫైనల్స్‌లో కె.అమిత్‌రెడ్డిపై 6–1, 6–2 తేడాతో ఈశ్వర్‌ సాయి, కొప్పుల సతీష్‌పై 6–1, 6–1 తేడాతో ఎన్‌.డి. విజయ్‌ ఆనంద్‌ విజయం సాధించారు.

డబుల్స్‌ విభాగంలో

70+ విభాగంలో ఎం.సాయిరామ్‌బాబు, ఎస్‌.ఎ రాజాక్‌పై ఎ.రాంబాబు, ఎస్‌.సేతు 6–4, 7–5 విజయం సాధించారు. డీఎస్‌ఎన్‌ రాజు, టి.సుందర్‌ వడి వేలుపై ఎన్‌.అశోక్‌ రెడ్డి, కె.సీతా రామరాజు 6–3, 6–3 పాయింట్లతో విజయం సాధించారు.

65+ విభాగంలో జి.చంద్రశేఖర్‌, కె.కోటయ్యగౌడ్‌పై వి.శ్రీనివాసరెడ్డి, ఎస్‌.మన్మథరావు 6–2, 6–2 తేడాతో, పి.చంద్ర, సలీంపై ఎస్‌.ఆనంద్‌ స్వరూప్‌, టి.శ్రీనివాస్‌ 6–2, 6–2 పాయింట్ల తేడాతో గెలుపొందారు.

55+ విభాగంలో ఎ.వెంకటేశ్వర్లు, శంకర్‌రెడ్డిపై కె.వి.ఎన్‌ మూర్తి, హేమంత్‌ కుమార్‌ 6–1, 6–0 తేడాతో విజయం సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement