నైపుణ్యాలతోనే ఉద్యోగాలు | - | Sakshi
Sakshi News home page

నైపుణ్యాలతోనే ఉద్యోగాలు

Feb 6 2026 7:17 AM | Updated on Feb 6 2026 7:17 AM

నైపుణ

నైపుణ్యాలతోనే ఉద్యోగాలు

నైపుణ్యాలతోనే ఉద్యోగాలు ఆరుగురికి సామాజిక సేవ శిక్ష అమలు రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి 50 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

ఏలూరు (టూటౌన్‌): నైపుణ్యాలతో యువత ఉద్యోగాలు సాధించి తమ జీవితాలను మెరుగు పర్చుకోవాలని సీడాప్‌ సీఈఓ పి.నారాయణ స్వామి పిలుపునిచ్చారు. పరిశీలనలో భాగంగా ఆయన బుధవారం ఏలూరు జిల్లాలోని పలు శిక్షణా కేంద్రాలను సందర్శించారు. అనంతరం ఏలూరులో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. సందర్శనలో భాగంగా సీడాప్‌–డీడీయూజికేవై ఆధ్వర్యంలో నడుస్తున్న వివాస్‌, సీడాప్‌, ముండ్రు ఇన్ఫ్రా ప్రాజెక్టు, భూమిక మహిళా గిరిజన సొసైటీ శిక్షణ కేంద్రాలను ఆయన పరిశీలించారు. శిక్షణా కేంద్రంలోని మౌలిక సదుపాయాలు, వసతి, భోజన సౌకర్యాలను స్వయంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. శిక్షణ నాణ్యతను అంచనా వేసే క్రమంలో ప్రాక్టికల్‌ ల్యాబ్‌లను సందర్శించిన నారాయణ స్వామి, తంగెళ్ళమూడిలోని డీడీయూజికేవై శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్న శిక్షణార్ధులకు యూనిఫార్మ్‌లు, వెల్‌కమ్‌ కిట్‌లను పంపిణీ చేశారు. స్టేట్‌ ప్రాజెక్టు మేనేజర్‌ రాధాకృష్ణ, వి.సురేష్‌, జేడీఎం, డీఆర్‌డీఏ పీడీ టీవీ విజయలక్ష్మి పాల్గొన్నారు.

నరసాపురం: ట్రాఫిక్‌ నిభంధనలు ఉల్లంఘించిన ఆరుగురు యువకులకు కోర్టు ఉత్తర్వుల ప్రకారం డీఎస్పీ డాక్టర్‌ శ్రీవేద ఆధ్వర్యంలో బుధవారం నరసాపురం అంబేడ్కర్‌ సెంటర్‌లో సామాజిక శిక్ష అమలు చేశారు. శిక్షపడ్డ వారిలో నలుగురిచే మైక్‌లో ట్రాఫిక్‌ నిబంధనలు చదివించారు. మరో ఇద్దరిచే ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. మూడు గంటల పాటు ఈ కార్యక్రమం సాగింది. పట్టణ పరిధిలో ట్రాపిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన ఆరుగురు వ్యక్తులను నరసాపరం మేజిస్ట్రేట్‌ కోర్టులో మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచగా భారతీయ న్యాయ సంహిత నూతన నిబంధన సెక్షన్‌ 4(ఎఫ్‌) కింద వారికి సామాజిక సేవ శిక్ష ఖరారు చేస్తూ తీర్పునిచ్చారని డీఎస్పీ చెప్పారు. ఒక్కొక్కరికి రూ.200 జరిమానాతో పాటు, బస్టాండ్‌ ఏరియా వంటి రద్దీ ప్రాంతాల్లో పోలీసులతో కలిసి మూడు గంటల పాటు ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ విధుల్లో పాల్గొనాలని కోర్టు ఆదేశించిందని తెలిపారు. దీంతో శిక్షను అమలు చేసినట్టు వివరించారు. సీఐ బి.యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

తణుకు అర్బన్‌: తణుకు రైల్వే అవుట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బుధవారం జరిగిన రైలు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. సుమారు 45 సంవత్సరాలు వయసు కలిగిన వ్యక్తి పైడిపర్రు డ్రైవర్స్‌ కాలనీ సమీపంలో రైలు పట్టాలపై పడి ఉండడాన్ని గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందజేశారు. మృతదేహం గుర్తుపట్టలేని విధంగా తల భాగం నుజ్జుయింది. మృతుడు ఆత్మహత్య చేసుకున్నాడా లేక రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మృతి చెందాడా అనేది తెలియాల్సి ఉంది. రైల్వే ఎస్సై సుబ్రహ్మణ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు తెలిసినవారు 99084 48729, 90140 99132 నంబర్లలో సమాచారం ఇవ్వాలని కోరారు. మృతదేహాన్ని తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు.

పాలకొల్లు సెంట్రల్‌: పోడూరు మండలం కవిటం శివారు ప్రాంతం నల్ల వెంకయ్య చెరువు ఏరియాలో 50 క్వింటాళ్లు పీడీఎస్‌ బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్‌ ఎస్సై కే సీతారాములు తెలిపారు. బుధవారం మండలంలో తనిఖీలు చేయగా గ్రంది కేశవరావు కిరాణా షాపులో 35 క్వింటాళ్లు, గ్రంధి నరసింహమూర్తి షాపులో 15 క్వింటాళ్లు మొత్తం 50 క్వింటాళ్లు పీడీఎస్‌ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందన్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దర్యాప్తులో మండల సివిల్‌ సప్లయి డీటీ నాగదేవి, వీఆర్వో కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

నైపుణ్యాలతోనే ఉద్యోగాలు 1
1/2

నైపుణ్యాలతోనే ఉద్యోగాలు

నైపుణ్యాలతోనే ఉద్యోగాలు 2
2/2

నైపుణ్యాలతోనే ఉద్యోగాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement