మీటర్ రీడర్ల ప్రధాన డిమాండ్లు
● స్మార్ట్ మీటర్ల నేపథ్యంలో మీటర్ రీడర్లకు విద్యుత్ శాఖలోనే ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలి.
● కనీస వేతనాలు అమలు చేయాలి.
● రీడర్ల విద్యార్హతను బట్టి విద్యుత్ శాఖలో టెక్నికల్, నాన్ టెక్నికల్ షిఫ్ట్ ఆపరేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, మిగిలిన వారిని వాచ్‌మెన్, అటెండర్ పోస్టుల్లో నియమించాలి.
● ఎస్‌క్రో ఖాతాను వెంటనే తెరవాలి.
● కాంట్రాక్టర్లు, విద్యుత్ శాఖ అధికారులతో విద్యుత్ మీటర్ రీడర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి.
జిల్లాలో భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం మూడు డివిజన్లు ఉన్నాయి. ఇందులో భీమవరం డివిజన్‌లో 2,09,970 సర్వీసులు, నరసాపురం డివిజన్‌లో 2,24,354, తాడేపల్లిగూడెం డివిజన్‌లో 2,19,440 కలిపి మొత్తం 6,53,764 సర్వీసులు ఉన్నాయి.


