తిరు వీధుల్లో శ్రీవారి దివ్య దర్శనం
ద్వారకాతిరుమల: తిరువీధుల్లో శ్రీవారి దివ్య దర్శనాన్ని పొందుతున్న భక్తులు తన్మయత్వం చెందుతున్నారు. ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని నిత్యం ఉభయ దేవేరులు, గోదాదేవితో పాటు శ్రీవారు క్షేత్ర పుర వీధుల్లో ఊరేగుతున్నారు. శుక్రవారం ఉదయం జరిగిన గ్రామోత్సవం నేత్రపర్వంగా సాగింది. ముందుగా ఆలయంలో విశేషంగా అలంకరించిన తొళక్క వాహనంపై సామి, అమ్మవార్లు, గోదాదేవి ఉత్సవ మూర్తులను ఉంచి, అర్చకులు విశేష పూజలు జరిపారు. ఆ తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అశ్వ, గజ సేవల నడుమ స్వామివారి వాహనం ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా క్షేత్ర పుర వీధులకు పయనమైంది. ప్రతి ఇంటి ముంగిట పెద్ద ఎత్తున భక్తులు శ్రీవారికి నీరాజనాలు సమర్పించారు. అనంతరం స్థానిక ధనుర్మాస మండపంలో స్వామి, అమ్మవార్లకు అర్చకులు, పండితులు ప్రత్యేక పూజలు జరిపి, భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.
తణుకు అర్బన్: దోమల మందు కొట్టే ఆటో అగ్నికి ఆహుతైన ఘటన తణుకు కోర్టు ఆవరణలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. దోమల మందు వెదజల్లే ఫాగింగ్ మెషీన్‌తో తణుకు మునిసిపాలిటీకి చెందిన ఆటో సుమారుగా రాత్రి 9.15 గంటల సమయంలో ఫాగింగ్ చేస్తూ కోర్టు ఆవరణలోకి వచ్చింది. అకస్మాత్తుగా ఫాగింగ్ మెషీన్ నుంచి మంటలు వ్యాపించి ఆటో తగలబడడంతో డ్రైవర్ అయ్యప్ప వెంటనే ఆటో నుంచి దిగిపోయాడు. నిమిషాల వ్యవధిలోనే మంటలు తీవ్రంగా వ్యాపించడంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారి అజయ్‌కుమార్ తమ సిబ్బందితో కలసి వచ్చి మంటలను అదుపుచేశారు. అయితే అప్పటికే ఆటో పూర్తిగా దగ్ధమైపోయింది. ఆటోతోపాటు, ఫాగింగ్ మెషీన్ నష్టం తెలియాల్సి ఉంది.
తిరు వీధుల్లో శ్రీవారి దివ్య దర్శనం


