
యోగా..ఉత్సాహంగా..
తాడేపల్లిగూడెం: పెంటపాడు మండలం ప్రత్తిపాడులో నాలుగు రోజులపాటు జరిగిన ఆరో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యోగాసన స్పోర్ట్స్ చాంపియన్‌షిప్ పోటీలు ఆదివారం ముగిశాయి. చివరి రోజు యోగ సాధకుల విన్యాసాలు ఆకట్టుకున్నారు. 23 జిల్లాల నుంచి సుమారు 550 మంది యోగ సా ధకులు ఐదు రకాల కేటగిరీల్లో పోటీపడ్డారు. విజేతలు ఛత్తీస్‌గఢ్, విజయవాడ, ముంబైలో జరిగే పోటీలకు అర్హత సాధించారు. సీనియర్ యోగాసన చాంపియన్‌షిప్ పోటీలు ఛత్తీస్‌గఢ్‌లో, జూనియర్ నేషనల్ యోగాసన పోటీలు విజయవాడలో, సబ్ జూనియర్ నేషనల్ చాంపియన్‌షిప్ పోటీలు ముంబైలో జరుగనున్నాయి. రాష్ట్రస్థాయి పోటీల్లో 87 మంది స్వర్ణ, 87 మంది రజత, 86 మంది కాంస్య పతకాలు సాధించారు. ముగింపు కార్యక్రమానికి అతిథులుగా హాజరైన ఉద్యాన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ బి.శ్రీనివాసులు, డీఎస్పీ విశ్వనాథ్ మాట్లాడుతూ యోగా అనేది నిత్య జీవితంలో ప్రతిఒక్కరికి అవసరమన్నారు. ఒత్తిళ్లను అధిగమించడానికి ఉపకరిస్తుందన్నారు. ముదిమి వయసులోనూ ఉత్సాహంగా ఉండేందుకు యోగా దోహదపడుతుందన్నారు. జాతీయ పరిశీలకుడు నంద కృపాకర్, అధ్యక్షురాలు అనంతనేని రాధిక, ప్రేమ్‌కుమార్, రాజశేఖరరెడ్డి, వెంకటరమణ, దుర్గారావు పోటీలను పర్యవేక్షించారు. యోగా పోటీల నిర్వాహకులు మాధవరావు, కరిబండి రామకృష్ణ , కోశాఽధికారి వెంకటేశ్వరరాజులు పాల్గొన్నారు. అతిథులు చేతులమీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. యోగా బృంద సభ్యులు పాల్గొన్నారు.
ముగిసిన రాష్ట్రస్థాయి పోటీలు

యోగా..ఉత్సాహంగా..

యోగా..ఉత్సాహంగా..