భీమవరం అర్బన్: కూటమి ప్రభుత్వంలో కొత్త పెన్షన్లు ఇవ్వక పోగా ఉన్న పెన్షన్లు తీసేయడం దారుణమని వైఎస్సార్ సీపీ భీ మవరం ఇన్‌చార్జి చినమిల్లి వెంకటరాయు డు అన్నారు. మండలంలోని గొల్లవానితిప్పలో ఆదివారం దివ్యాంగుడు ఆయనకు సమస్యలు విన్నవించారు. ఈ సందర్భంగా చినమిల్లి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబు సూపర్ సిక్స్ పేరుతో ప్ర జలను మోసం చేశారన్నారు. అధికారం చే పట్టాకా పెన్షన్లు పెంచాల్సింది పోయి ఉన్న దివ్యాంగుల పింఛన్లను రీ వెరిఫికేషన్ పేరు తో తొలగిస్తున్నారని, దీంతో రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులు గగ్గోలు పెడుతున్నారన్నారు. ముఖ్యంగా కక్షగట్టి వైఎస్సార్ సీపీకి చెందిన దివ్యాంగుల పెన్షన్లు తొలగిస్తున్నారని, దివ్యాంగులకు పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నరసాపురం పార్లమెంట్ ఇన్‌చార్జి గూడూరి ఉమాబాల ఉన్నారు.