
సైక్లింగ్‌తో ఆరోగ్యం
భీమవరం: శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి, పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ జీవితంలో సైక్లింగ్‌ను భాగంగా చేసుకోవా లని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అన్నారు. ఆదివారం ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని ఎస్పీ ప్రారంభించి మాట్లాడారు. వాహనాల వాడకంతో కాలుష్యం పెరుగుతుందని, పరిష్కారంగా సైకిల్‌ను ఉపయోగించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చన్నారు. గుండె సంబంధిత రోగాల నివారణ, మధుమేహ నియంత్ర ణ, ఒత్తిడిని తగ్గించడం, శరీర బరువు నియంత్రణ వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు సైక్లింగ్ ద్వారా చేకూరుతాయన్నారు. అనంతరం పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బందితో కలిసి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి పెద అమిరం ఎస్పీ క్యాంపు కార్యాలయం వరకు సైకిల్‌పై ర్యాలీ నిర్వహించారు. ఏఎస్పీ వి.భీమారావు, జిల్లా ఆర్మ్‌డ్ రిజర్వ్ డీఎస్పీ ఎంవీవీ సత్యనారాయణ, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ వి.పుల్లారావు, వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఎం.నాగరాజు, భీమవరం రూరల్ ఇన్‌స్పెక్టర్ బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.