
వైఎస్సార్‌సీపీ శెట్టిబలిజ విభాగ అధ్యక్షుడిగా కవురు
పాలకొల్లు సెంట్రల్: వైఎస్సార్ సీపీ రాష్ట్ర శెట్టిబలిజ విభాగ అధ్యక్షుడిగా శాసనమండలి సభ్యుడు కవురు శ్రీనివాస్‌ను నియమించారు. శనివారం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నియామకం జరిగినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది. కవురు శ్రీనివాస్ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ తనకు పలు పదవులు ఇచ్చి సముచిత స్థానం కల్పించిందన్నారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించిన పార్టీ అధినేత జగన్ మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కమ్యూనిటీ సంఘ పెద్దలు, సభ్యులను కలుపుకుని పార్టీన మరింత బలో పేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు.
తాడేపల్లిగూడెం (టీఓసీ): న్యాయవాదులకు ప్రభుత్వం హెల్త్ కార్డులు ఇవ్వాలని ఆలిండియా లాయర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. యూనియన్ జిల్లా కమిటీ సమావేశం శనివారం స్థానిక బార్ అసోసియేషన్ హాల్‌లో జరిగింది. సంఘ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు దిగుపాటి రాజగోపాల్ మాట్లాడుతూ కూటమి నాయకులు ఎన్నికల ముందు మ్యాచింగ్ గ్రాంట్ కింద మృతి చెందిన న్యాయవాదుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఇస్తానని వాగ్దానం చేశారని, అయితే రాష్ట్రంలో 1,275 మంది న్యాయవాద వృత్తిలో మృతి చెందితే 103 మందికి మాత్రమే ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవాదుల రక్షణకు చర్యలు తీసుకోవాలని, కొత్తగా వచ్చిన న్యాయవాదులకు స్టయిఫండ్ ఇవ్వాలని అన్నారు. లా నేస్తం పథకాన్ని కొనసాగించాలని కోరారు. సమస్యలు పరిష్కారం కాకుంటే పోరాటాలే శరణ్యమన్నారు. లక్ష్మి, కౌరు వెంకటేశ్వర్లు, కామన మునిస్వామి తదితరులు పాల్గొన్నారు.
భీమవరం(ప్రకాశంచౌక్): సనాతన ధర్మ పరిరక్షణ అందరి బాధ్యత అని, రాగద్వేషాలకు అతీతంగా జీవనం సాగిస్తే మానవ జన్మకు సార్థకత అని హరేరామ మూమెంట్ అక్షయ పాత్ర అధ్యక్షుడు వంశీధర్ దాసు అన్నారు. స్థానిక ఆనంద ఫంక్షన్ హాల్‌లో ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను కలెక్టర్ నాగరాణి హాజరై ప్రారంభించారు. హరేరామ హరేకృష్ణ నామమే సుఖాల రుగ్మతలకు పరిష్కారమని దాసు అన్నారు. భగవద్గీత మానవుని మనుగడకు మార్గదర్శకమన్నారు. జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, ఆనందరాజు ఫౌండేషన్ చైర్మన్ ఉద్దరాజు కాశీ విశ్వనాథ్‌రాజు, విజయవాడ గోకుల క్షేత్రం సభ్యుడు మహత్రవ దాసు, వేడుకల కమిటీ సభ్యుడు కంతేటి వెంకటరాజు తదితరులు హాజరయ్యారు. చిన్నారులకు శ్రీకృష్ణుని వేషధారణ, చిత్రలేఖనం, స్వామి కీర్తనలు, సంప్రదాయ నృత్యాలు, శ్లోకాలు, చిత్రలేఖనం పోటీ లు నిర్వహించగా జిల్లానలుమూలల నుంచి 350 మంది హాజరయ్యారు.
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు నూజివీడుకు చెందిన దాత నక్కా సత్యనారాయణ శనివారం 3 టన్నుల కూరగాయలను విరాళంగా అందజేశారు. దొండ, బెండ, దోస, సొర, టమోటాలు వంటి పలు రకాల కూరగాయలను అందజేసి, స్వామివారి అన్నప్రసాదంలో వినియోగించాలని కోరారు.

వైఎస్సార్‌సీపీ శెట్టిబలిజ విభాగ అధ్యక్షుడిగా కవురు

వైఎస్సార్‌సీపీ శెట్టిబలిజ విభాగ అధ్యక్షుడిగా కవురు