
ఉండి.. బస్టాండ్‌లో సమస్యలు దండి
ఉండి: ఉండి నియోజకవర్గాన్ని రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని పదేపదే చెబుతున్న కూటమి పాలకులు ఒక్కసారి ఉండి బస్టాండ్‌పై లుక్కేయండని ప్రయాణికులు అంటున్నారు. నియోజకవర్గాన్ని తలమానికంగా చేస్తామంటే ఏంటో అనుకున్నాం కానీ బస్టాండ్ ప్రాంగణాన్ని చెరువుగా మా ర్చడమా అని ఎద్దేవా చేస్తున్నారు. బస్టాండ్ ప్రాంగణమంతా భారీ గోతులు పడి కొద్దిపాటి వర్షానికీ మునిగిపోతోంది. నెలల తరబడి ప్రాంగణం ఇలా ఉన్నా కనీసం మరమ్మతులు కూడా చేయడం లేదు. బస్టాండ్ ఆవరణలో రోడ్డు కనీసం 100 మీటర్లు కూడా లేదని, దీనిని సీసీ రోడ్డుగా నిర్మించే ఆలోచన కూడా పాలకులకు లేదని అంటున్నారు. ఉండి బస్టాండ్‌కు విజయవాడ, ఏలూరు, గుడివాడ, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాలకు జంక్షన్‌గా ఉంది. బస్టాండ్‌లో కనీసం కూర్చునేందుకు కుర్చీలు, బల్ల లు లేవు. తాగునీటి సౌకర్యం లేదు. ప్రయాణికులు బస్టాండ్ లోనికి వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రయాణికుల ఇ బ్బందులను ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని, ప్రజలపై ఎందుకింత కక్ష అని వైఎస్సార్‌సీపీ నాయకులు జంపా నాగేశ్వరరావు, అంగర రాంబాబు, పీవీఆర్‌కే ఆంజనేయరాజు మండిపడుతున్నారు. మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడమే కాదు బస్టాండ్‌లో కనీస వసతులు కల్పించాలని అంటున్నారు. కూటమి ప్రభుత్వం కనీసం బస్టాండ్‌లో రోడ్లు కూడా వేయించలేని దుస్థితిలో ఉందా అని ప్రశ్నిస్తున్నారు.
ఉండి బస్టాండ్ ప్రాంగణంలో చెరువులను తలపిస్తున్న గోతులు
చెరువును తలపిస్తున్న ప్రాంగణం
పాలకులూ పట్టించుకోరా?

ఉండి.. బస్టాండ్‌లో సమస్యలు దండి

ఉండి.. బస్టాండ్‌లో సమస్యలు దండి