
● శ్రీవారి కొండ.. భక్తజనమే నిండా
భక్తులతో మాట్లాడుతున్న ఈఓ మూర్తి
ఉచిత బస్సు వద్ద భక్తులు
శ్రీనివాసా గోవిందా.. వేంకట రమణా గోవిందా.. నామస్మరణలు మార్మోగాయి. వేలాదిగా వచ్చిన భక్తులు, నవ దంపతులతో చిన వెంకన్న క్షేత్రం భక్త సాగరాన్ని తలపించింది. శనివారం వేకువజాము నుంచి భక్తుల రాక మొదలైంది. ఆలయ ప్రాంగణం, దర్శనం క్యూలైన్లు, అనివేటి మండపం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, కల్యాణ కట్ట ఇలా అన్ని విభాగాలూ కిటకిటలాడాయి. భక్తులకు అందుతున్న సౌకర్యాల ను ఆలయ ఈఓ ఎన్‌వీ సత్యనారాయణమూర్తి స్వయంగా పరిశీలించారు. నిత్యాన్నదాన భవనంలో అన్నప్రసాదంపై భక్తులను ఆరా తీశారు. స్వామివారి నిత్య కల్యాణ మండపంలో 192 కల్యాణాలు జరిగాయి. ఆదివారం సైతం భక్తుల రద్దీ కొనసాగనుంది. –ద్వారకాతిరుమల

● శ్రీవారి కొండ.. భక్తజనమే నిండా

● శ్రీవారి కొండ.. భక్తజనమే నిండా